Pawan Kalyan Review: శాంతిభద్రతలపై డీసీఎం పవన్ సమీక్ష- పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan Review: పిఠాపురంలో శాంతిభద్రతలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

AP DCM Pawan Kalyan Review: పిఠాపురంలో శాంతిభద్రతలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. నేరస్తులకు అండగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. తన నియోజకవర్గం పరిధిలోని స్టేషన్‌ల పోలీసుల వైఖరిపై నివేదిక కోరారు.
పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం శాంతి భద్రతలపై ఇవాళ(27 మార్చి 2025)న సమీక్ష నిర్వహించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఒకరిద్దరు చేసిన తప్పులు కారణంగా పోలీసు వ్యవస్థకే మచ్చ వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే నేరస్తులకు అండగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసుల తీరుపై ఫిర్యాదులు వస్తున్నాయని ఇది మంచిది కాదని వార్నింగ్ ఇచ్చారు.
పిఠాపురంలో పోలీసుల పని తీరుపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అవినీతి పాల్పడుతున్నారని నేరస్తులకు అండగా ఉంటున్నారని అన్నారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదని అన్నారు. ప్రజలకు మేలు చేసేలా మాత్రమే ప్రవర్తించాలని సూచించారు. పిఠాపురం పరిధిలోని నాలుగు స్టేషన్ పరిధిలో పోలీసుల తీరుపై ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇవ్వలని ఆదేశించారు.
నియోజకవర్గ పరిధిలో ఇకపై ఎలాంటి సమస్యలు రానీయొద్దని అధికారులకు సూచించారు. ఇలాంటివి రిపీట్ అయితే మాత్రం ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ జామ్‌లు, ఇతర సమస్యలపై కూడా పవన్ అధికారులకు పలు సూచనలు చేశాు. పిఠాపురం- ఉప్పాడ రైల్వే గేటు వద్ద ప్రజలకు సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ట్రాఫిక్ జామ్ అవ్వడంతో జనం ఇబ్బంది పడుతున్నారని దాన్ని పరిష్కరించాలని ఆదేశించారు.
పిఠాపురంలో వేసవి వేళ తాగునీటి సమస్య రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల వద్ద తనిఖీలు చేపట్టాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు తావు లేకుండా అర్హులు అందరికి పనులు దొరికేలా చూడాలని సూచించారు. ఇప్పటికే అమలు అవుతున్న పథకాలు అర్హులకు అందుతున్నాయో లేదో చూసుకొని మార్పులు చేర్పు చేసుకోవాలని చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

