Mad Square Box Office Collections: మూడు రోజుల్లోనే 'మ్యాడ్ స్క్వేర్' రికార్డు కలెక్షన్లు - థియేటర్లలో నవ్వుల వసూళ్లు ఎంతో తెలుసా?
Mad Square Collections: నార్నే నితిన్ హీరోగా వచ్చిన కామెడీ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్ స్క్వేర్' బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. మూడు రోజుల్లోనే రూ.55.2 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

Mad Square Collections First Week End Collections: యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) మూవీ ఈ నెల 28న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఫస్ట్ డేనే తెలుగు రాష్ట్రాల్లో రూ.5.27 కోట్లతో అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి 3 రోజుల్లోనూ అదే జోష్ కొనసాగించింది.
3 రోజుల్లోనే రికార్డు కలెక్షన్లు
ఈ మూవీ తొలి 3 రోజుల్లోనూ రూ.55.2 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ టీం తెలిపింది. 'థియేటర్ల వణుకు, ప్రేక్షకుల కేకలు, MAD గ్యాంగ్ రాజ్యమేలుతుంది' అంటూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయమైన సినిమా 'మ్యాడ్'కు సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కింది. కాలేజీ నేపథ్యంలో మ్యాడ్ తెరకెక్కగా మూవీలో నార్నే నితిన్‌తో పాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించారు.
Theatres are shaking 😉
— Sithara Entertainments (@SitharaEnts) March 31, 2025
Crowds are roaring 🫶🏻
And the MAD gang is ruling 😎#MadSquare grosses 55.2 Crs+ in 3 Days and the repeat audience fever is spreading like wildfire ❤️🔥#BlockBusterMaxxMadSquare 🥳@NarneNithiin #SangeethShobhan #RamNitin @ItsJawalkar @MusicThaman… pic.twitter.com/pic3DmWOmD
ఫుల్ కామెడీతో నవ్వులు పూయించిన 'మ్యాడ్' బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఇదే జోష్‌తో మేకర్స్ సీక్వెల్‌గా 'మ్యాడ్ స్క్వేర్' తెరకెక్కించారు. ఈ సీక్వెల్‌లో లడ్డూగాని పెళ్లి, స్నేహితుల గోవా ట్రిప్, వారి అల్లరిని కలిపి రూపొందించారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా.. సినిమా బ్యాక్ టు బ్యాక్ నవ్వులే అంటూ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పించగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.
Also Read: కోటి రూపాయలు కామన్... ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసిన వైష్ణవి చైతన్య!
స్టోరీ ఏంటంటే?
బీటెక్ పూర్తైన తర్వాత లడ్డు (విష్ణు ఓయ్) పెళ్లిలో మళ్లీ అశోక్ (నార్నే నితిన్), డిడి (సంగీత్ శోభన్), మనోజ్ (రామ్ నితిన్) కలుస్తారు. అయితే, వీళ్లు చేసిన ఓ పని వల్ల ఆ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. దీంతో వీరంతా కలిసి గోవా వెళ్తారు. లడ్డు పెళ్లి క్యాన్సిల్ అయ్యాక పెళ్లి మండపంలో అశోక్, డిడి, మనోజ్ ఏం చేశారు? ఇక గోవా వెళ్లిన వీరిని పట్టుకోవాలని పోలీసులు ఎందుకు ప్రయత్నించారు? ఓ వైపు పోలీసులు వెతుకుతుంటే... మరోవైపు నలుగురిని భాయ్ (సునీల్) ఎందుకు టార్గెట్ చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కథకు ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం ఆడియన్స్‌కు కామెడీ డైలాగ్స్, పంచులతో ఎంటర్‌టైన్ చేసింది ఈ సినిమా.
ఆ ఓటీటీలోకి..
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా.. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, శాటిలైట్ హక్కులను 'స్టార్ మా' సొంతం చేసుకున్నట్లు సమాచారం.





















