అన్వేషించండి

Ustaad Bhagat Singh Story : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?

Ustaad Bhagat Singh : పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ స్టోరీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ మూవీ స్టోరీని తాజాగా బుక్ మై షోలో అప్డేట్ చేశారు.

Pawan Kalyan's Ustaad Bhagat Singh Story : ఉస్తాద్ భగత్ సింగ్... పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మూవీ. అనుకున్న దాని కంటే ముందే అంటే మార్చి 19కే వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గబ్బర్ సింగ్ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవర్ స్టార్‌ను మళ్లీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఈ మూవీలో చూపించనున్నారు. ఈ క్రమంలో స్టోరీ ఏంటి దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 

ఉస్తాద్ భగత్ సింగ్ రీమేకా?

ఈ మూవీ తమిళ సినిమా 'థెరీ'కి రీమేక్ అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై హరీష్ శంకర్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. తనకు ఏదైనా మూవీ నచ్చితే అది రీమేక్ చేయాల్సి వస్తే ముందే చెబుతానని... ఉస్తాద్ రీమేక్ కాదని స్పష్టం చేశారు. అందుకే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ తన పేరుతో వస్తున్నాయని చెప్పారు. 

స్టోరీ అదేనా?

'బుక్ మై షో' వెబ్‌సైట్‌లో ఈ మూవీ స్టోరీని ముందు రివీల్ చేశారు. ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీని శత్రువులు కక్ష కట్టి మరీ చిన్నాభిన్నం చేయడంతో భార్య, తల్లిని పోగొట్టుకుని కూతురితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్తాడు. కొన్నేళ్ల తర్వాత కొందరు ఆ పోలీస్ ఆఫీసర్ ఆచూకీని తెలుసుకుంటారు. ఈ క్రమంలో తన కూతురిని రక్షించుకునేందుకు శత్రువులతో ఎలా పోరాడాడు? అనేదే స్టోరీ అంటూ ముందు పేర్కొన్నారు.

అయితే, తాజాగా మార్చిన అప్డేట్ ప్రకారం కొత్త స్టోరీ ఏంటంటే... గిరిజన తెగకు చెందిన భగత్ సింగ్ అనే యువకుడు తన టీచర్ అందించిన ఇన్‌స్పిరేషన్‌తో జీవితాన్ని విలువలు, నైతికతతో కొనసాగిస్తుంటాడు. తన చుట్టూ జరిగే అన్యాయాలు, అక్రమాలు ఎదుర్కొనేందుకు ధైర్య సాహసాలు ప్రదర్శిస్తాడు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంలో సమాజంలో చీడ పురుగులను ఖాకీ డ్రెస్ వేసుకుని మరీ ఏరేస్తుంటాడు. దేశ సమగ్రత, సమైక్యత, ప్రజల శ్రేయస్సు కోసం తన జీవితాన్నే అంకితం చేసిన ఓ వారియర్ స్టోరీ 'ఉస్తాద్ భగత్ సింగ్' అంటూ రివీల్ చేశారు. ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతోంది.

Also Read : వివాహ బంధంతో ఒక్కటైన అల్లు శిరీష్, నయనిక - సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు

ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన లుక్స్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. త్వరలోనే మరో పాట రిలీజ్ చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా... తమన్ బీజీఎం అందించనున్నారు. మూవీలో పాలిటిక్స్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదని... సరికొత్త రోల్‌లో పవన్‌ను చూడబోతున్నట్లు చెప్పారు హరీష్ శంకర్. 

సినిమాలో పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. అలాగే, తమిళ హీరో పార్తీబన్ విలన్ రోల్ చేస్తున్నారు. అశుతోష్ రాణా, చమ్మక్ చంద్ర, గౌతమీ, నవాబ్ షా, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Editor Madhu Reddy: తెలుగు చిత్రసీమలో విషాదం... గుండెపోటుతో యంగ్ ఎడిటర్ మృతి
తెలుగు చిత్రసీమలో విషాదం... గుండెపోటుతో యంగ్ ఎడిటర్ మృతి
Pradeep Ranganathan: విఘ్నేష్ శివన్ సినిమాతో హిట్ రాలేదు... మరో సీనియర్‌కు ప్రదీప్ రంగనాథన్‌ ఛాన్స్ ఇస్తాడా?
విఘ్నేష్ శివన్ సినిమాతో హిట్ రాలేదు... మరో సీనియర్‌కు ప్రదీప్ రంగనాథన్‌ ఛాన్స్ ఇస్తాడా?
Mahavatar Parashuram: నరసింహ తర్వాత మహా అవతార్ పరశురామ్... రిలీజ్ ఎప్పుడంటే?
నరసింహ తర్వాత మహా అవతార్ పరశురామ్... రిలీజ్ ఎప్పుడంటే?
Chiranjeevi On Pawan Kalyan Surgery: కళ్యాణ్ బాబు సేఫ్... తమ్ముడి హెల్త్‌పై అన్నయ్య చిరంజీవి మెగా అప్డేట్
కళ్యాణ్ బాబు సేఫ్... తమ్ముడి హెల్త్‌పై అన్నయ్య చిరంజీవి మెగా అప్డేట్
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran Ceasefire: అమెరికాతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
అమెరికాతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
IPL 2026 KKR VS RR Result Update: రింకూ ర‌పారపా.. కేకేఆర్ ను తొలి విజ‌యాన్ని అందించిన ఫినిష‌ర్, రాయ‌ల్స్ పై థ్రిల్లింగ్ విక్ట‌రీ, రాణించిన అనుకుల్, వ‌రుణ్, త్యాగీ
రింకూ ర‌పారపా.. కేకేఆర్ ను తొలి విజ‌యాన్ని అందించిన ఫినిష‌ర్, రాయ‌ల్స్ పై థ్రిల్లింగ్ విక్ట‌రీ, రాణించిన అనుకుల్, వ‌రుణ్, త్యాగీ
Project Punarvika: ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
Editor Madhu Reddy: తెలుగు చిత్రసీమలో విషాదం... గుండెపోటుతో యంగ్ ఎడిటర్ మృతి
తెలుగు చిత్రసీమలో విషాదం... గుండెపోటుతో యంగ్ ఎడిటర్ మృతి
Adilabad Airforce Station: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
Blast At Firecracker Factory: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
 Kia India Announces Massive Discounts: కియా కార్లపై అదిరిపోయే ఏప్రిల్ ఆఫర్లు.. ఏకంగా రూ. 3.20 లక్షల వరకు డిస్కౌంట్! పూర్తి వివరాలు ఇవే!
కియా కార్లపై అదిరిపోయే ఏప్రిల్ ఆఫర్లు.. ఏకంగా రూ. 3.20 లక్షల వరకు డిస్కౌంట్! పూర్తి వివరాలు ఇవే!
Viral Video: ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
Embed widget