అన్వేషించండి

Vaishnavi Chaitanya: కోటి రూపాయలు కామన్... ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసిన వైష్ణవి చైతన్య!

Vaishnavi Chaitanya Upcoming Movies: సిద్ధూ జొన్నలగడ్డ 'జాక్'తో ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది వైష్ణవి చైతన్య. ఆనంద్ దేవరకొండతో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత మరొక సినిమా ఓకే చేసినట్టు తెలిసింది.

తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) వరుస ఆఫర్లతో దూసుకు వెళుతోంది. ఈ మధ్య ఆవిడ ఒక ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాకు సంతకం చేసినట్లు తెలిసింది. ఆ సినిమాకు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

కోటి రూపాయలు కామన్‌...
వైష్ణవి చైతన్య క్రేజ్ కోసం తప్పదు!
హీరోయిన్లుగా స్టార్ స్టేటస్ అందుకున్న తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ మంది. ఆ విషయంలో దర్శక నిర్మాతల నుంచి ఒక్కోసారి మన అమ్మాయిలు ఎక్కువ మంది రావడం లేదని, వచ్చిన వాళ్లు అన్ని క్యారెక్టర్లు చేయడానికి రెడీగా లేరనే మాటలు వినబడతాయి! టాలెంట్ ఉంటే స్టార్ స్టేటస్ అందుకోవడం అంతా కష్టం ఏమీ కాదని వైష్ణవి చైతన్య ప్రూవ్ చేస్తున్నారు. యూట్యూబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఆ అమ్మాయి ఇప్పుడు యంగ్ హీరోల సరసన క్రేజీ ఫిలిమ్స్ చేస్తున్నారు. కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న తొలి తెలుగు అమ్మాయిగా రికార్డులు క్రియేట్ చేస్తున్నారని వినికిడి. 

'బేబీ'తో కథానాయికగా పరిచయమైన వైష్ణవి చైతన్య... ఫిమేల్ లీడ్ రోల్ చేసిన మొదటి సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత దిల్ రాజు నిర్మాణ సంస్థలో ఆయన సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ సరసన 'లవ్ మీ' సినిమా చేశారు. ఆ చిత్రానికి కోటి రూపాయల పారితోషకం అందుకున్నట్లు అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. అది పక్కన పెడితే... ఇటీవల ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు వైష్ణవి చైతన్య సంతకం చేసినట్లు తెలిసింది. ఆ చిత్రానికి దర్శక నిర్మాతలు కోటి రూపాయలు ఆఫర్ చేశారట. 

ఆల్రెడీ వైష్ణవి పారితోషకం కోటికి కాస్త అటు ఇటుగా ఉంది. యూత్ ఆడియన్స్, కుటుంబ ప్రేక్షకులలో ఆవిడకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా కనుక ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి ఉంటుంది. పైగా సినిమా ప్రచార బాధ్యతలు భుజాన వేసుకోవాలి. అందుకని ఆవిడకు కోటి రూపాయలకు పైగా ఇవ్వడానికి ఆ దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారట.

సినిమాల ఎంపికలో జాగ్రత్తగా ముందడుగు!
'బేబీ' భారీ విజయం సాధించడానికి, 100 కోట్లు వసూలు చేయడానికి వైష్ణవి చైతన్య పాత్ర, అందులో ఆవిడ నటన ప్రధాన కారణమని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఆ సినిమా ద్వారా ఆవిడకు వచ్చిన క్రేజ్ చాలా ఆఫర్లు తీసుకొచ్చింది. అయితే వైష్ణవి చైతన్య ఎడాపెడా సినిమాలు ఒప్పేసుకోవడం లేదు.‌ తనకు వచ్చిన వాటిలో నచ్చిన కథలు, ఆ సినిమాలు నిర్మించే నిర్మాతలను సైతం దృష్టిలో పెట్టుకొని సంతకాలు చేస్తున్నారు.

Also Readసల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?

స్టార్ బాయ్స్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన 'జాక్' సినిమాలో ఆవిడ నటించారు. ఏప్రిల్ 10న ఆ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఆ తర్వాత ఆనంద్ దేవరకొండ సరసన సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న '90స్ ఏ మిడిల్ క్లాస్' బయోపిక్ వెబ్ సిరీస్ సీక్వెల్ కింద రూపొందుతున్న సినిమాలోను నటిస్తున్నారు. ఆ రెండు సినిమాలు అగ్ర నిర్మాణ సంస్థల్లోవి కావడం గమనార్హం. సినిమాల ఎంపికలో ఆచితూచి జాగ్రత్తగా ముందడుగు వేస్తున్నారు వైష్ణవి చైతన్య.

Also Readరాబిన్‌హుడ్ రివ్యూ: ఇది నితిన్‌ 'కిక్'... కథ తీసేస్తే కనీసం కామెడీ క్లిక్ అయ్యిందా? నితిన్‌కు హిట్ వస్తుందా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
TG TET Results 2025: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
Andhra Pradesh News: ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
AI digital rules: ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు

వీడియోలు

Allu Arjun 42 New Rules Viral Video | బన్నీతో మాట్లాడాలంటే 42 రూల్స్ ఉన్నాయా.? వైరల్ వీడియోలో నిజమెంత.? | ABP Desam
Attack on PM Modi at Parliament | ప్రధాని మోదీపై మహిళా ఎంపీల ప్రీ ప్లాన్డ్ ఎటాక్.? | ABP Desam
India vs Pakistan T20 World Cup | ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పీసీబీ
BCCI Central Contract | కోహ్లీ, రోహిత్‌ గ్రేడ్ తగ్గింపు
ICC Shocking Decision against PCB | ద్వైపాక్షిక సిరీస్‌లు కావాలని ఐసీసీని కోరిన పాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
TG TET Results 2025: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
Andhra Pradesh News: ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
AI digital rules: ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
AP Assembly Sessions: అమరావతిలో అసెంబ్లీ నగారా- బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. వైసీపీ వన్ డే ప్లాన్!
అమరావతిలో అసెంబ్లీ నగారా- బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. వైసీపీ వన్ డే ప్లాన్!
Hydra Latest News: కబ్జా చెర నుంచి పార్క్, ప్రభుత్వ భూమి కాపాడిన హైడ్రా! 1500 కోట్ల విలువైన ల్యాండ్‌ సేఫ్‌!
కబ్జా చెర నుంచి పార్క్, ప్రభుత్వ భూమి కాపాడిన హైడ్రా! 1500 కోట్ల విలువైన ల్యాండ్‌ సేఫ్‌!
Sumanth: సుమంత్ సినిమాకు భారీ బడ్జెట్... ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్
సుమంత్ సినిమాకు భారీ బడ్జెట్... ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్
Telangana Municipal Elections: మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక రద్దు- మంత్రి వాకిటి శ్రీహరిని బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్
మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక రద్దు- మంత్రి వాకిటి శ్రీహరిని బర్తరఫ్ చేయాలని డిమాండ్
Embed widget