Vishwanath And Sons Movie : సూర్య ఫస్ట్ తెలుగు మూవీ రీమేకా? - విశ్వనాథ్ అండ్ సన్స్‌పై ఫుల్ క్లారిటీ ఇదే... టీజర్ ట్రీట్ రెడీ
Suriya Venky Atluri : కోలీవుడ్ స్టార్ సూర్య డైరెక్ట్ తెలుగు మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ సినిమా మలయాళ మూవీకి రీమేక్ అంటూ గత 2 రోజులుగా నెట్టింట ప్రచారం సాగుతుండగా దానిపై క్లారిటీ వచ్చింది.

Suriya's Vishwanath And Sons Movie Remake Rumours Clarity : కోలీవుడ్ స్టార్ సూర్య, వెంకీ అట్లూరి కాంబోలో రాబోతోన్న మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి వచ్చిన సూర్య స్టైలిష్ డీసెంట్ లుక్ అదిరిపోయింది. చేతిలో బిడ్డతో వన్ మ్యాన్ ఆర్మీలా ఉన్న లుక్ హైప్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ మలయాళ యాక్షన్ కామెడీ మూవీకి రీమేక్ అంటూ ప్రచారం సాగుతుండగా... అందులో నిజం లేదని తెలుస్తోంది.
రీమేక్ కాదు
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళ యాక్షన్ కామెడీ 'కంగారూ'కి రీమేక్ అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే, ఇందులో నిజం లేదని సమాచారం. తెలుగులో సూర్యకు ఇదే ఫస్ట్ మూవీ కాగా... ఆయన కోసం వెంకీ అట్లూరి స్వయంగా డిఫరెంట్ స్టోరీతో స్క్రిప్ట్ డెవలప్ చేసినట్లు తెలుస్తోంది. రీమేక్ అంటూ వచ్చిన రూమర్స్ నిజం కావని ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
Also Read : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
టీజర్ ఎప్పుడంటే?
ఈ మూవీ టీజర్‌ను అతి త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రాబోయే 10 రోజుల్లోనే టీజర్ రానున్నట్లు సమాచారం. కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా థియేటర్లలో భారీ స్థాయిలో టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ నెల 19న పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'తో పాటు 'ధురంధర్ 2' రిలీజ్ కానుండగా వీటితో పాటే థియేటర్లలో స్క్రీనింగ్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
హార్ట్ టచింగ్ ఫ్యామిలీ ఎమోషన్‌తో పాటు సెంటిమెంట్ ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. సూర్య డైరెక్ట్ తెలుగు మూవీకి 'విశ్వనాథ్ అండ్ సన్స్' అంటూ క్లాసిక్ టైటిల్ ఫిక్స్ చేశారు. దీంతో స్టోరీపై హైప్ పదింతలు అవుతోంది. సూర్య కెరీర్‌లో ఇది 46వ సినిమా కాగా... ఆయన సరసన మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. జులైలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు























