Nandamuri Balakrishna: ఆ మాట మాట మన ఒంటికి పట్టదు... పద్మభూషణ్ ఆలస్యంగా వచ్చిందనే కామెంట్స్‌పై బాలయ్య రియాక్షన్
Nandamuri Balakrishna : 'ఆదిత్య 369' రీరిలీజ్ కు సిద్ధం అవుతున్న వేళ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య పద్మభూషణ్ ఆలస్యంగా వచ్చిందనే కామెంట్స్ పై సమాధానం చెప్పారు.

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'ఆదిత్య 369'. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటి టెక్నాలజీతో రీరిలీజ్ కి ముస్తాబవుతోంది. ఎస్పీ బాలసుబ్రమణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించిన ఈ మూవీని ఏప్రిల్ 4న మరోసారి థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్లో 'ఆదిత్య 369' మూవీ రీరిలీజ్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య తనకు పద్మభూషణ్ ఆలస్యంగా వచ్చింది అనే కామెంట్స్ పై స్పందించారు. అందరూ అనుకున్నట్టుగా ఇదేమీ ఆలస్యం కాదని, కరెక్ట్ గా టైంకి వచ్చిందని వెల్లడించారు.
పద్మభూషణ్ ఆలస్యంపై బాలయ్య రియాక్షన్
'ఆదిత్య 369' మూవీ ఈవెంట్ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ పద్మభూషణ్ ఆలస్యంగా వచ్చిందనే కామెంట్స్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ "పద్మభూషణ్ ఆలస్యంగా వచ్చిందని చాలామంది అంటున్నారు. కానీ నిజానికి అది కరెక్ట్ టైంకి వచ్చింది. ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ అనే మాట ఈమధ్య తరచుగా వినిపిస్తోంది. కానీ ఆ పదం మన ఒంటికి పట్టదు. ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేశాను. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. నేను ఆహాలో చేసిన అన్ స్టాపబుల్ షో దేశంలోనే నెంబర్ వన్ రియాల్టీ షోగా పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్ గానూ ఉండి ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకు సేవలు అందించాము" అంటూ సరైన టైంలోనే పద్మభూషణ్ రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు బాలయ్య.
50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తయ్యాకే పద్మభూషణ్
నందమూరి బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా 14 ఏళ్లకే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. 'తాతమ్మ కల' అనే సినిమాతో ఆయన టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'వేములవాడ భీమకవి', 'దానవీరశూరకర్ణ', 'అక్బర్ సలీం అనార్కలి', 'శ్రీమద్విరాట్ పర్వము', 'శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం' అనే సినిమాలలో నటించారు. ఇక ఆ తర్వాత హీరోగా మారిన బాలయ్య కెరీర్ ను 'మంగమ్మగారి మనవడు' సినిమా సృష్టించిన సంచలనం మలుపు తిప్పింది. అనంతరం ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఆయన లక్ష్మీనరసింహ, సింహా, లెజెండ్, డిక్టేటర్, వీర సింహారెడ్డి లాంటి సినిమాలతో రాయలసీమ ఫ్యాక్షన్ పవర్ ఏంటో తెరపై చూపించారు. ఇప్పటివరకు వందకు పైగా చారిత్రక, పౌరాణిక, సాంఘిక, జానపద సినిమాలో నటించిన బాలయ్య సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలకు గాను 2025 జనవరి 25న పద్మభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించి గౌరవించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు ఆయన కెరీర్ లోనే కల్ట్ క్లాసిక్ గా నిలిచిన 'ఆదిత్య 369' మూవీని సరికొత్త టెక్నాలజీతో బాలయ్య ఫ్యాన్స్ కోసం రీరిలీజ్ చేస్తున్నారు. మరోవైపు టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తుండగా, నందమూరి అభిమానులు కూడా 'ఆదిత్య 369' మూవీని, అందులోని టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ను బిగ్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

