Robinhood Twitter Review - 'రాబిన్‌హుడ్' ట్విట్టర్ రివ్యూ: ఆ దేవుడి మీద భారం వేయక తప్పదా... నితిన్ సినిమాకు ఊహించని టాక్!
Robinhood Movie Review Telugu: నితిన్, శ్రీ లీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన రాబిన్ హుడ్ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ టాక్ అంత గొప్పగా లేదు. ట్విట్టర్ రివ్యూ చూస్తే మూవీ ఫ్లాప్ అనిపిస్తోంది.

Nithiin's Robinhood Movie Review: 'రాబిన్ హుడ్' సినిమాతో కం బ్యాక్ ఇస్తానని నితిన్ చాలా బలంగా చెప్పారు. 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్'లో శ్రీ లీలతో నటించానని, ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందని, కానీ ఈ సినిమాతో తామిద్దరం హిట్ పెయిర్ అనిపించుకుంటామని ఆయన తెలిపారు. అయితే... ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచి వస్తున్న టాక్ అందుకు భిన్నంగా ఉంది. సోషల్ మీడియాలో సినిమా టాక్ చూస్తుంటే ఫ్లాప్ తప్పదేమో అనిపిస్తుంది.
ఫస్టాఫ్ పర్వాలేదు కానీ...
చెప్పుకోవడానికి ఏం లేదు!
'రాబిన్ హుడ్' ఫస్టాఫ్ పర్వాలేదు కానీ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. కామెడీ వర్కౌట్ అయిందని చెప్పుకొచ్చాడు. పాటల గురించి అయితే అసలు అడగొద్దన్నాడు. సెకండాఫ్ సినిమాను సేవ్ చేయాలని తెలిపాడు. తర్వాత సెకండాఫ్ పోర్షన్స్ పర్వాలేదన్నాడు. అయితే శ్రీలీల ఎపిసోడ్ మాత్రం క్రింజ్ అని కామెంట్ చేశాడు.
Good 1st half, so far comedy worked well..!! nothing much to talk about songs. boring interval, stage set hope 2nd half saves.. #Robinhood #RobinhoodReview
— Peter Reviews (@urstrulyPeter) March 27, 2025
Done with my show,good 2nd half, where each & every episode worked out except cringe Leela portions. David Bhai cameo at the end is hilarious!!adidha suprisu song is good..!! Overall a decent commercial entertainer 2.5/5 #Robinhood
— Peter Reviews (@urstrulyPeter) March 27, 2025
నితిన్, శ్రీలీల జోడి ఓకే...
క్లైమాక్స్‌లో డేవిడ్ వార్నర్ ధమాకా!
సెకండాఫ్ తర్వాత కూడా సినిమా టాక్ మారలేదు. నితిన్, శ్రీ లీల జంట గురించి పరవాలేదని టాక్ వచ్చింది. వాళ్ళిద్దరి నటన గురించి గొప్పగా చెప్పేది ఏమీ లేదట. డేవిడ్ వార్నర్ ధమాకా చూడడం కోసం క్లైమాక్స్ వరకు వెయిట్ చేయాలట. అది సంగతి. ఆయన మాత్రం హిలేరియస్‌గా నవ్వించారట. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ మీద విమర్శలు వస్తున్నాయి.
నట కిరీటితో కిషోర్ కామెడీ!
ఫస్టాఫ్ వరకు నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ చేసిన కామెడీ కొంత వరకు వర్కౌట్ అయిందని ఇద్దరు ముగ్గురు పేర్కొనగా... కామెడీ కూడా ఏమీ లేదని మరికొందరు తెలిపారు. కథ కోసం కాదని, ఫ్లోలో అలా చూస్తూ వెళ్లాల్సిన సినిమా అని అంటున్నారు. 'అదిదా సర్‌ప్రైజ్'లో కేతికా శర్మ బాగా చేసిందని చెబుతున్నారు.
Done with 1st Half of #Robinhood !
— FILMOVIEW (@FILMOVIEW_) March 27, 2025
Here is the #Review so far:
Strictly Average!!
As a commercial cinema, plot and treatment is quite routine, but the comedy by #VennelaKishore & #RajendraPrasad garu worked out to an extent!
Generated good laughs in the theatre!
Needs a very… https://t.co/3yhnScEFtP
Done with #Robinhood 🚨
— FILMOVIEW (@FILMOVIEW_) March 28, 2025
Here is my #Review :
An average flick!
Some comedy parts worked out well. But #Sreeleela scenes & Songs failed miserably for me! They felt too unnecessary and cringe!
Just for the comedy parts!!!#Premiere #UK #London #Telugu https://t.co/3yhnScEFtP pic.twitter.com/RJ2CwNZe8D
Show completed:- #Robinhood
— venkatesh kilaru (@kilaru_venki) March 27, 2025
Fun entertainer 👍
Above average movie 2.75/5
First half is good
Okayish Second half
Not a story based film ... go with the flow
Go with your family , have fun#Robinhood series will continue... 2nd part villain @davidwarner31 pic.twitter.com/yrd3PGpsl6
పక్కా కమర్షియల్ ఫార్మాట్...
రొటీన్ ట్రీట్మెంట్, యావరేజ్!
'రాబిన్ హుడ్' సినిమా చూసిన జనాలు దర్శకుడు వెంకీ కుడుముల రైటింగ్ మీద విమర్శలు చేస్తున్నారు. ఆయన రచనలో ప్రతిదీ ఆర్టిఫిషియల్ కింద ఉందని, కొత్తగా ఏమీ లేదని, సినిమాలో ఒక సోల్ మిస్ అయ్యిందని చెబుతున్నారు. పక్కా కమర్షియల్ ఫార్మాటులో తీసిన ఈ సినిమా జనాలను మెప్పించడం కష్టమని కాస్త ఘాటుగా పోస్టులు చేస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో రొటీన్ ట్రీట్మెంట్ కమర్షియల్ ఫార్మాట్ తప్ప ఏమీ లేవంటున్నారు. స్ట్రిక్ట్లీ యావరేజ్ సినిమా అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
@VenkyKudumula anna endhi anna maku idhi asal intha worst ga okaru cinema ni teyochu ani prove chesav worst movie I've watched in recent time is #Robinhood @actor_nithiin thanks for the torture you gave us. @sreeleela14 please I beg you to stop acting please🙏
— Thaagubothu🥃 (@reventhmails5) March 28, 2025
Rating 1/5 pic.twitter.com/qfZdcB068x
#Robinhood
— Laxmi Tweets (@Laxmi_Tweets_9) March 28, 2025
Movie is absolute cringe-fest#SriLeela portions are especially unbearable pure cringe overload
zero excitement
zero highs
zero entertainment
total waste of time and money
0.5/5 rating avoid at all costs#Nithin #MadSquare #DavidWarner #KetikaSharma #kethikasharma pic.twitter.com/2uBh9WKlTv
The second half started off slow but gradually picked up momentum. The cameo of David Warner in the climax was a fun touch! However, the biggest drawback was the songs, which didn’t quite match the film’s energy. BGM was good
— Sethuu (@NarisettiSethu) March 27, 2025
Venky has done decent job👍
Rating: 2.5/5#Robinhood https://t.co/QlWvH4pPvm
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

