Ugadi Panchangam in Telugu (2025-2026): ఏప్రిల్ 2025 to మార్చి 2026 సింహ రాశివారికి విశ్వావసు నామ సంవత్సరంలో ఏ నెల ఎలాంటి ఫలితాలున్నాయి!
Simha Rasi Ugadi Rasi Phalalu 2025-2026: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సింహ రాశి వారికి ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకూ నెలవారీ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..

Ugadi Yearly Rasi Phalalu 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశివారికి ఏ నెలలో ఎలాంటి ఫలితాలున్నాయి...
సింహ రాశి ఉగాది పంచాంగం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
ఏప్రిల్ 2025
ఈ నెల ఆరంభంలో అన్నింటా పరాజయమే. అనారోగ్యం తప్పదు. చేపట్టిన పనులు పూర్తికావు. వాహన ప్రమాద సూచలున్నాయి జాగ్రత్త. అనుకోని వివాదాల్లో చిక్కుకుంటారు. ఊహించని సమస్యలు..శత్రువుల కారణంగా ఇబ్బందులు ఉంటాయి
మే 2025
శ్రీ విశ్వావసు నామసంవత్సరం మే నెలలో సింహ రాశివారికి కొంత బాగానే ఉంటుంది. వృత్తి. వ్యాపారాల్లో రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. ధనలాభం ఉంటుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. నెల ఆరంభం కన్నా గడిచేకొద్దీ ఇంకా శుభఫలితాలున్నాయి
జూన్ 2025
కొత్త ఏడాది జూన్ నెలలోనూ మీకు మంచి ఫలితాలే ఉన్నాయి. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. ఆరోగ్యం బావుంటుంది. వృత్తివ్యాపారాలు కలిసొస్తాయి. కుటుంబం నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది. శత్రువులే మిత్రులుగా మారుతాయి. నూతన కార్యాలు చేపట్టి పూర్తిచేస్తారు. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి.
మేష రాశి ఉగాది ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
జూలై 2025
ఈ నెలలో సింహ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఇబ్బందిపెడతాయి. అనారోగ్య సూచన. నమ్మినవారే మోసం చేస్తారు. ముఖ్యమైన పనులున్నీ వాయిదా పడతాయి. జన్మంలో కుజుడి సంచారం వల్ల వివాదాలు, ప్రమాదాలుంటాయి.
ఆగష్టు 2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆగష్టు నెల సింహరాశివారికి లాభించదు. ప్రతికూల గ్రహ సంచారం వల్ల కోపం అధికంగా ఉంటుంది. అసహనం పెరుగుతుంది...అందరితోనూ గొడవలకు దిగుతారు. ఆదాయాన్ని మించి ఖర్చులుంటాయి. వ్యసనాలబారిన పడతారు. చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి.
సెప్టెంబర్ 2025
సింహ రాశివారికి సెప్టెంబర్ 2025లో ఆర్థికంగా బావుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ కోపం కారణంగా నష్టపోతారు. మీ ప్రవర్తన ఇతరులకు నచ్చదు. చేయని పనులకు శిక్ష అనుభవిస్తారు.
వృషభ రాశి ఉగాది ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
అక్టోబర్ 2025
అక్టోబరులో కొంత ఉపశమనంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలుంటాయి. ఆర్థికంగా అడుగు ముందుకు పడుతుంది. సమస్యలున్నా ధైర్యంగా దూసుకెళ్తారు. దైవసంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నవంబర్ 2025
గతకొంతకాలంగాపడుతున్న బాధల నుంచి నవంబర్ నెలలో కొంత ఊరట లభిస్తుంది. ఆదాయం, ఆరోగ్యం బావుంటాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. వైవాహిక జీవతంలో సమస్యలు తొలగి సంతోషం ఉంటుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు.
డిశంబర్ 2025
ఈ నెలలోనూ మీకు మంచి ఫలితాలున్నాయి. వృత్తివ్యాపారాలు మెరుగుపడతాయి. ఆర్ధికంగా కొంతమేర బాగానే ఉంటుంది. వాహనం మారుస్తారు. గృహంలో మార్పులుంటాయి. ధైర్యంగా దూసుకెళ్తారు. ఆరోగ్యం బావుటుంది. సంతోషంగా ఉంటారు. కొత్తగా ప్రారంభించిన పనులు కలిసొస్తాయి.
(మిథున రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
జనవరి 2026
ఆంగ్ల నూతన సంవత్సరం ఆరంభం సింహ రాశివారికి అదిరింది. అన్నింటా జయం, సంతోషం, ఆర్థికలాభం ఉంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు చేతికందుతాయి. ఉన్నత వ్యక్తులతో పరిచయం ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి ఉంటుంది. సంఘంలో మీ గౌరవం పెరుగుతుంది.
ఫిబ్రవరి 2026
ఈనెలలో మిశ్రమఫలితాలుంటాయి. వృత్తి,వ్యాపారాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వవు. ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఆలోచిస్తారు. చెడు వార్తలు వినాల్సి రావొచ్చు. ఊహించని సంఘటనలు జరుగుతాయి. మానసికంగా బాధపడతారు.
మార్చి 2026
ఈ నెల్లోనూ సింహ రాశివారికి ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం సరిగా ఉండదు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి. కళ్లకు, తలకు సంబంధించిన సమస్యలు వేధిస్తాయి. వాహన ప్రమాద సూచనలున్నాయి. బంధుమిత్రులతో విరోధాలు..కావాల్సినవాళ్లు దూరమవడం జరుగుతుంది. మీ గౌరవానికి భంగం కలిగే సంఘటనలు జరుగుతాయి.
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

