అన్వేషించండి

Bengaluru: బెంగళూరులో బతకడం కష్టమేనా - లక్షన్నర జీతం - అయినా ఫ్యామిలీని పోషించడం కష్టంగా ఉందంటున్న టెకీ !

Viral News: లక్షన్నర జీతం వచ్చినా ఫ్యామిలీని పోషించడం కష్టంగా మారిందని ఓ టెకీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన రెడిట్ పోస్టుకు చాలా మంది కనెక్ట్ అవుతున్నారు.

Life in a metro is fragile: మెట్రో నగరాల్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అంటే డబ్బులకు కొదవలేదని అనుకుంటారు. కానీ ఇప్పుడు వారి జీవన శైలి కూడా అదే విధంగా ఉంచుకోవాల్సి రావడంతో వారంతా అప్పుల పాలవుతున్నారు. బెంగళూరులో ఉద్యోగం చేసే టెకీ ఒకరు తన ఆవేదనను రెడిట్ ఫ్లాట్ ఫామ్‌పై పంచుకోవడంతో చాలా మంది తమ కడుపులో బాధను బయట పెట్టుకుంటున్నారు. తమ పరిస్థితి కూడా అలాగే ఉందంటున్నారు. 

"మెట్రోలో జీవితం ఎందుకు అంత దుర్భరంగా అనిపిస్తుంది?"  అనే టైటిల్ పెట్టి తన బాధ అంతా వెళ్లగక్కాడు.  నెలకు రూ. 1.5 లక్షలకు పైగా సంపాదిస్తున్నానని జీవితంలో స్థిరత్వం లేదని బాధపడ్డాడు. ఒకవేల ఉద్యోగం కోల్పోతే తానే సేవ్ చేసుకున్న మొత్తం కొన్ని నెలల్లోనే అయిపోతాయని లెక్కలేసుకున్నాడు.  తన ఆదాయం పైకి ఆకట్టుకునేలా అనిపించినప్పటికీ, తన స్వస్థలంలో తన కుటుంబాన్ని పోషించడానికి అయ్యే ఆర్థిక భారం, దానితో పాటు ఉన్న రుణ చెల్లింపులు అన్నీ పోను కూడా నెలకు రూ. 30,000 నుండి రూ. 40,000 వరకు మాత్రమే పొదుపు చేయగలుగుతున్నానన్నాడు.  

తన చిన్న తనంలో బెంగళూరు లైఫ్ అంటే అద్భుతం అననుకున్నానని కానీ ఇప్పుడు బెంగళూరు జీవితాన్ని ఫ్రాగిల్ తో పోల్చారు. ఎప్పుడైనా పగిపోయేంత సున్నితంగా ఉందని అతని అభిప్రాయం. ఆ ఉద్యోగి భయం.. పెరిగిపోయిన ఖర్చులు. లక్షన్నర సంపాదిస్తున్నా సరిపోవడం లేదంటే రేపు హఠాత్తుగా ఉద్యోగం పోతే పరిస్థితి ఏమిటని ఆయన భయం.  నిరుద్యోగిగా మారితే, నెలవారీ ఖర్చులు మరియు EMIల బరువు దృష్ట్యా, అతని పొదుపులు మూడు నుండి నాలుగు నెలల్లో తగ్గిపోతాయి. ఇంకా విషయం ఏమిటంటే ఈ టెకీకి ఇంకాపెళ్లి కాలేదు. పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నాడు. పెళ్లి అయితే ఆ పొదుపులు కూడా చేయలేనని అనుకుంటున్నారు. కొత్తగా వచ్చే కుటుంబంతో పాటు ఊరిలో తల్లిదండ్రులకూ తానే ఖర్చులకుపంపాల్సి ఉంటుంది. 
 
ఈ పరిస్థితుల్లో బెంగళూరు టెకీ చాలా మందికి  మంచి జీతం అని భావించేంత సంపాదించినప్పటికీ, ప్రాథమిక అవసరాలను కూడా భరించలేక తాను ఇబ్బంది పడుతున్నానని అతను బాధపడుతున్నాడు. తనకు ఒక్కడికే ఇలాంటి సమస్యలు ఉన్నాయా..అందరూ ఇలాంటి బాధల్లోనే ఉన్నారా అన్న డౌట్ కూడా అతనికి వచ్చింది. అదే విషయాన్ని తన స్టోరీని పోస్టు చేసి ప్రశ్నించాడు. దీనికి చాలా మంది టెకీలు స్పందించారు. ఆదాయం బాగా ఉంటే జీవితం బాగా ఉండదని.. చెప్పుకొచ్చారు. డబ్బుల గురించి ఆలోచిస్తే అలాగే ఉంటుందని అంటున్నారు. 

బెంగళూరు లాంటి నగరాల్లో జీవన వ్యయం అమాంతంగా పెరిగిపోతోంది. ఓ డబుల్ బెడ్ రూం ఇల్లు అద్దె కనీసం ముఫ్పైవేలు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో భారీగా జీతం ఆర్జించే టెకీలు కూడా ఆందోలన చెందుతున్నారు. ఇప్పటికి ఇబ్బంది లేదు కానీ.. ఒక వేల లే ఆఫ్‌ ప్రకటిస్తే బతుకు ఎంత దుర్భంగా మారుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.                   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: కేసీఆర్‌ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి
కేసీఆర్‌ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి
Pawan Kalyan Latest News: అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
Telangana CM Revanth Reddy:
"రక్తమరుగుతుంది, బట్టలూడదీసికొడతారు"- జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 
Prakashraj vs Pawan:  గెలవక ముందు “జనసేనాని” గెలిచిన తరువాత “భజన సేనాని” - మరోసారి పవన్ ను గిల్లిన ప్రకాష్ రాజ్
గెలవక ముందు “జనసేనాని” గెలిచిన తరువాత “భజన సేనాని” - మరోసారి పవన్ ను గిల్లిన ప్రకాష్ రాజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga babu Indirect Counters on Varma | టీడీపీ ఇన్ ఛార్జి వర్మపై నాగబాబు పరోక్ష కౌంటర్లు | ABP DesamPawan Kalyan on Tamil Movies | భారతదేశం ఏమన్నా కేకు ముక్క కోసుకోవటానికి.? | ABP DesamPawan Kalyan on his Ideology | పూటకో పార్టీతో ఉంటావనే వాళ్లకు ఇదే నా ఆన్సర్ | ABP DesamPawan Kalyan on Tamilnadu Language Fight | హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీలో మాట్లాడి మేటర్ చెప్పిన పవన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: కేసీఆర్‌ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి
కేసీఆర్‌ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి
Pawan Kalyan Latest News: అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
Telangana CM Revanth Reddy:
"రక్తమరుగుతుంది, బట్టలూడదీసికొడతారు"- జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 
Prakashraj vs Pawan:  గెలవక ముందు “జనసేనాని” గెలిచిన తరువాత “భజన సేనాని” - మరోసారి పవన్ ను గిల్లిన ప్రకాష్ రాజ్
గెలవక ముందు “జనసేనాని” గెలిచిన తరువాత “భజన సేనాని” - మరోసారి పవన్ ను గిల్లిన ప్రకాష్ రాజ్
Telangana CM Revanth Reddy:
"కేసీఆర్ ఆరోగ్యంతో వందేళ్లు అక్కడ ఉండాలే- మేం ఇక్కడ ఉండాలే" స్టేచర్‌పై మళ్లీ రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Guntur Latest News : గుంటూరు నగర మేయర్ రాజీనామా- కారణం ఏంటంటే?
గుంటూరు నగర మేయర్ రాజీనామా- కారణం ఏంటంటే?
Andhra Pradesh Latest News:
"అక్టోబర్‌ 2 తర్వాత హెలికాప్టర్ ఎక్కడైనా దిగొచ్చు" చంద్రబాబు వార్నింగ్ మెసేజ్ 
Tirupati Crime News:రాత్రికి రాత్రే గోవుల మాయం - గూడూరులో సంచలనం
రాత్రికి రాత్రే గోవుల మాయం - గూడూరులో సంచలనం
Embed widget