Pawan Kalyan on Tamil Movies | భారతదేశం ఏమన్నా కేకు ముక్క కోసుకోవటానికి.? | ABP Desam
తమిళనాడులో తెలుగోడిగా చాలా అవమానాలు ఎదుర్కొన్నానన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తమిళ్ వాళ్లకు హిందీ పై అంత విద్వేషం ఉంటే..తమిళ్ సినిమాలను ఎందుకు డబ్బింగ్ చేసి బాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్నారని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ తమిళనాడుపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. ప్రధానంగా తమిళనాడు సీఎం స్టాలిన్ టార్గెట్ గా చాలా కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. హిందీ వద్దు అనుకున్నప్పుడు తమిళ చిత్ర పరిశ్రమ హిందీ రాష్ట్రాల్లో తమిళ సినిమాలను ఎందుకు విడుదల చేస్తోందని ప్రశ్నించిన పవన్...ఛత్తీస్ ఘడ్, ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల నుంచి డబ్బులు దోచుకోవాలనే టార్గెట్ తో రిలీజ్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. సమస్యకు పరిష్కారం వేర్పాటు వాదం కాదని చెప్పిన పవన్ కళ్యాణ్...భారత దేశం ఏం కేకు ముక్క కాదని ఎవరికి నచ్చినట్లు వాళ్లు కోసుకు తీసుకువెళ్లటానికి అని అన్నారు.





















