CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ గుంటూరులో భారీ ఆందోళనకు దిగింది. వైసీపీ కార్యకర్తలతో కలిసి ప్రభుత్వంపై వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబటి రాంబాబు పెద్ద ర్యాలీ తీశారు. అయితే ర్యాలీకి అనుమతులు లేవంటూ పోలీసులు బారికేడ్లను పెట్టి అంబటిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై అంబటి రాంబాబు ఫైర్ అయిపోయారు. తననే అడ్డుకుంటారా అంటూ కార్యకర్తలను వదిలిపెట్టాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడకు చేరుకున్న పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు అంబటికి నచ్చచెప్పే ప్రయత్నం చేయగా...అంబటిపై ఆయనపై మాటల దాడికి దిగారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సీఐ...ఏయ్ నువ్వు మాజీ మంత్రివైతే ఏంటయ్యా ఎక్కువ తక్కువ మాట్లాడకు అంటూ అంబటికి రివర్స్ ఫైర్ అయ్యారు. పోలీసుల నుంచి ప్రతిఘటనను ఊహించని అంబటి నిర్ఘాంతపోగా...వేరే పోలీసు అధికారులు..కానిస్టేబుళ్లు సీఐకి కూడా నచ్చచెప్పే పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. అయితే వైసీపీ నేత, మాజీ మంత్రి పై పోలీస్ అధికారి అరుస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.





















