మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా? డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
ఏపీ డిప్యూటీ సీఎం కాన్వాయ్‌లోని ఓ కారు ఓ మహిళను ఢీకొట్టిన సంఘటన ఏపీలో కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లాలోని పలమనేరు సమీపంలోని ముసలిమడుగులో పర్యటన ముగించుకుని తిరిగి హెలీ ప్యాడ్‌కు వెళ్లే సమయంలో పవన్ కాన్వాయ్ ఓ మహిళను గుద్దినట్లు తెలుస్తోంది. పవన్ కారును చూసిన జనం ఒక్కసారిగా కారు ముందుకు వచ్చేయడంతో ఒక్కసారిగా తోపులాట జరిగ్గా.. ఆ గందరగోళంలో ఓ మహిళ కింద పడటం.. ఆమె కాలిపై నుంచి పవన్ కారు వెళ్లడం జరిగినట్లు సమాచారం. ఇది గమనించిన పవన్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆమెని వెనక్కి లాగి ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. అయితే తన కారు మహిళ కాలిపై ఎక్కినా డిప్యూటీ పవన్ కల్యాణ్ పట్టించుకోకుండా వెళ్లిపోయాడంటూ బాధితురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోలు కూడా బయటకొచ్చాయి. ఇక గాయపడిన మహిళకు ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ పూర్తికాగా.. ఆమె ప్రస్తుతం కోలుకుంటోంది. మరి దీనిపై డిప్యూటీ సీఎం నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో చూడాలి.






















