Andhra King Taluka Collections : 'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
Andhra King Taluka Collections : రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది. 3 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా గ్రాస్ కలెక్షన్స్ ఓసారి చూస్తే...

Ram Pothineni's Andhra King Taluka 3 Days Box Office Collections : టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన రీసెంట్ మాస్ ఎంటర్టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. ఫస్ట్ డే అటు ఓవర్సీస్‌లోనూ ఇటు ఇండియావ్యాప్తంగా కలెక్షన్ల పరంగా దుమ్ము రేపింది.
3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
ఈ మూవీ వీకెండ్ కలెక్షన్స్ కాస్త తగ్గినా ఓవరాల్‌గా మంచి నెంబర్‌నే అందుకుంది. వరల్డ్ వైడ్‌గా రూ.16.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. మూడో రోజు రూ.5 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. ఇండియావ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.7.65 కోట్ల గ్రాస్ రాగా... ఇండియావ్యాప్తంగా రూ.4.15 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. మరోవైపు ఓవర్సీస్ నార్త్ అమెరికాలో 4 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మూవీ టీం వెల్లడించింది.
View this post on Instagram
Also Read : 'కాంతార'పై కామెడీ కామెంట్స్ - బాలీవుడ్ హీరో రణవీర్‌పై తీవ్ర ఆగ్రహం... లెజెండ్ సారీ చెబుతారా?
ఈ మూవీకి పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తుండగా... ఉపేంద్ర, రావు రమేష్, మురళీ శర్మ, వీటీవీ గణేష్, సత్య, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత సరైన హిట్ కోసం ఎదురు చూసిన రామ్‌కు మూవీ సరైన బూస్ట్ అనే చెప్పాలి. హీరో అభిమానిగా ఫుల్ ఎనర్జీతో రామ్ యాక్టింగ్ అదరగొట్టారు.
స్టోరీ ఏంటంటే?
వరుసగా ఫ్లాప్ మూవీస్ తర్వాత తన వందో సినిమాకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటాడు సూర్య (ఉపేంద్ర). తన కారు, ఆస్తులు అమ్మినా సరిపోవు. చివరకు రూ.3 కోట్లు అవసరం కాగా తన అభిమాని నుంచి అతని ఖాతాకు ఆ డబ్బు వస్తుంది. దీంతో అతను ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు సూర్య. రాజమండ్రి సమీపంలోని గూడపులంకలో ఉండే వీరాభిమాని సాగర్ (రామ్) నుంచి తనకు ఆ డబ్బు వచ్చిందని తెలుసుకుని అతన్ని కలవానుకుంటాడు.
సూర్యకు వీరాభిమాని అయిన సాగర్ తన జూనియర్ స్థానిక ధియేటర్ ఓనర్ పురుషోత్తం (మురళీశర్మ) కూతురి (భాగ్యశ్రీ బోర్సే)ని ప్రేమిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పురుషోత్తం సాగర్‌ను అవమానిస్తాడు. దీంతో ఓ ఛాలెంజ్ చేసి దాన్ని నెరవేర్చుకునేందుకు ప్లాన్ చేస్తుంటాడు. అసలు సాగర్ చేసిన ఛాలెంజ్ ఏంటి? దాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అసలు సూర్యకు పంపిన రూ.3 కోట్లు ఎక్కడివి? సాగర్‌ను సూర్య కలిశాడా? సాగర్ ప్రేమ సక్సెస్ అయ్యిందా అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















