అన్వేషించండి

Janasena Clarity: దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి

Jana Sena: పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని కాంగ్రెస్ నేతల్ని జనసేన కోరింది. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ సంబంధాలు ఉన్నాయన్నారు.

Deputy CM Pawan Kalyan comments:  కోనసీమ జిల్లాలో దిష్టి గురించి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని జనసేన పార్టీ కోరింది.  తెలంగాణలో పలువురు రాజకీయ నేతలు చేస్తున్న రాజకీయంపై జనసేన పార్టీ స్పందించింది. రెండు రాష్ట్రాల మద్య సుహృద్భావ వాతావరణం ఉందని.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని రెండు లైన్ల ప్రకటనను జనసేన పార్టీ విడుదల చేసింది. 

 

హఠాత్తుగా విమర్శలు ప్రారభించిన కాంగ్రెస్ నేతలు        

గత వారం కోనసీమలో కొబ్బరి చెట్లు తలలు వాల్చేస్తున్న అంశంపై పవన్ కల్యాణ్ రైతులతో మాట్లాడారు. ఆ సందర్బంగా రాష్ట్ర విభజన కు కోనసీమ పచ్చదనం కారణం అని.. తెలంగాణ నేతల దిష్టి తగిలిందని అన్నారు. చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా కొంత మంది మంత్రులు ఘాటుగా స్పందించడం ప్రారంభించారు.సినిమాలు ఆపేస్తామని..  పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఇలా మట్లాడుతూండటంతో ఇంకా కొనసాగే అవకాశం ఉండటంతో దీనికి తెరదించాలని జనసేన పార్టీ ఈ ప్రకటన జారీ చేసినట్లుగా కనిపిస్తోంది.         

వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని జగదీష్ రెడ్డి సలహా          

మరో వైపు  పవన్ వ్యాఖ్యల పై లేటుగా స్పందిస్తున్న కాంగ్రెస్ నేతల పై మాజీమంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రాంత మనోభావాలు దెబ్బతిన్నాయని అనిపిస్తే వెంటనే ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని.. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నట్లు చెప్పాల్సి ఉందన్నారు. వారాంతం తెలంగాణకు ఎక్కువగా వచ్చే పవన్ కి ఇక్కడే ఎక్కువ ఆస్థులున్నాయి.. ఎక్కువ సమయం తెలంగాణాలోనే ఉన్న పవన్ ఇక్కడి ప్రాంతాన్ని కూడా ప్రేమించాలన్నారు. పవన్ పరిణతి చెందిన నాయకుడిగా ఇప్పటికే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సి ఉందని.. ఉద్యమం తరవాత అంతా ఎక్కడా క్రాస్ టాక్ మా వైపు నుండి రాలేదని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. మంచి కాంక్షించి అందరిని కడుపులో పెట్టి చూసుకున్నాం ..పది రోజుల తరువాత పవన్ మాటలపై కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కమీషన్లు పంచుకునే పనిలో ఉండి పవన్ వ్యాఖ్యలు పట్టించుకోలేదా..కాంగ్రెస్ ఇప్పుడు స్పందించడం పై ఏమైనా ప్రత్యేక కారణాలున్నాయా లేక మ్యాచ్ ఫిక్సింగా అని ప్రశ్నించారు.          

సినిమాలను ఎలా ఆపుతారని కోమటిరెడ్డిని ప్రశ్నించిన జగదీష్ రెడ్డి                 

పవన్ సినిమాలు ఎలా ఆగుతాయి ఎవరి అభిమానులు వారికి ఉంటారు..కాంగ్రెస్ మంత్రులు పవన్ సినిమాలు చూడొద్దంటే జనాలు ఆగుతారా అని ప్రశఅనించారు.  సెన్సేషన్ కోసం డైలాగులు మాట్లాడొద్దని కొమటిరెడ్డికి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎవరు మాట్లాడినా ప్రజాస్వామిక పద్ధతి పాటించాలి..పవన్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.    

టాప్ హెడ్ లైన్స్

Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget