Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
Akhanda 2 : బాలయ్య 'అఖండ 2' కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఓ వీరాభిమాని భారీ ధరకు టికెట్ కొనుగోలు చేశాడు.

Balakrishna Fan Buys Akhanda 2 Single Ticket For 2 Lakhs : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబో అవెయిటెడ్ మాస్సివ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'అఖండ 2' సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీస్‌లోనూ బాలయ్య ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ ఎటు చూసినా అఖండ 2 తాండవమే కనిపిస్తోంది. తాజాగా ఓ లేటెస్ట్ న్యూస్ వైరల్ అవుతోంది.
టికెట్ రూ.2 లక్షలు
బాలయ్య వీరాభిమాని 'అఖండ 2' టికెట్‌ను భారీ ధరకు సొంతం చేసుకున్నాడు. జర్మనీలో ఫ్రాంక్‍ఫర్ట్‌లో బాలయ్య వీరాభిమాని ఏకంగా రూ.2 లక్షలు పెట్టి కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... అసలు ఆ అభిమాని ఎవరు? ఫస్ట్ షో టికెట్ తీసుకున్నాడా? లేదా ప్రీమియర్ షో టికెట్ తీసుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య ఫ్యాన్స్... 'ఇదీ బాలయ్య క్రేజ్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్యపై అభిమానానికి బార్డర్స్ లేవని అంటున్నారు.
#Balayya’s craze knows no borders 🔥🔥🔥
— BA Raju's Team (@baraju_SuperHit) November 30, 2025
A devoted NBK fan in Frankfurt, Germany bought a single ticket to #Akhanda2 for a whopping ₹2 Lakhs 💥💥
Natasimham #NandamuriBalakrishna’ #Akhanda2Storm is just getting started ❤️🔥❤️🔥❤️🔥#Akhanda2Thaandavam in cinemas December 5th! pic.twitter.com/OOycnex9q5
Also Read : 'కాంతార'పై కామెడీ కామెంట్స్ - బాలీవుడ్ హీరో రణవీర్‌పై తీవ్ర ఆగ్రహం... లెజెండ్ సారీ చెబుతారా?
సెన్సార్ రివ్యూ
ఈ మూవీ సెన్సార్ పనులు కూడా పూర్తి కాగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ ఇవ్వగా డ్యూయెల్ రోల్‌లో బాలయ్య అదరగొట్టారని... ఫస్ట్ పార్ట్‌ను మించి సీక్వెల్‌లో విజువల్స్, బీజీఎం వేరే లెవల్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సనాతన హిందూ ధర్మ పరిరక్షణతో పాటు భారతీయ సంస్కతి, సంప్రదాయాలు ప్రముఖ క్షేత్రాల గొప్పదనం చక్కగా చూపించినట్లు తెలుస్తోంది. ఇప్పటి ట్రెండ్‌కు ఓ మంచి మెసేజ్‌తో పాటు మాస్ అంశాలను కూడా మూవీలో ఉన్నాయని సమాచారం. తమన్ బీజీఎం నిజంగా బాక్సులు బద్దలవ్వాల్సిందే అనే రీతిలో ఉన్నాయని... శివయ్య ఎలివేషన్ టైంలో అఘోర పాత్ర స్క్రీన్‌పై కనిపించేటప్పుడు వచ్చే శ్లోకాలు అద్భుతమని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్, ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా... ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు. పూర్ణ, హర్షాలి మెహతా కీలక పాత్రలు పోషించారు. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 5న తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఫ్యాన్స్‌కు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు 3D ఫార్మాట్‌లోనూ రిలీజ్ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ థియేటర్ల వద్ద భారీ కటౌట్స్‌తో సందడికి రెడీ అవుతున్నారు.





















