అన్వేషించండి

AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు

దిత్వా తుపాను తీవ్రత కారణంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

AP Rains Update | అమరావతి: నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరప్రాంతాల్లో దిత్వా తుఫాను 12 కి.మీ వేగంతో ఉత్తరం వైపుకు కదిలి నేటి ఉదయం అదే ప్రాంతంపై, 11.4° ఉత్తర అక్షాంశం,  80.6° తూర్పు రేఖాంశం దగ్గర ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కడలూరు (భారతదేశం)కి తూర్పు-ఆగ్నేయంగా 100 కి.మీ., కరైకల్ కి తూర్పు-ఈశాన్యంగా 100 కి.మీ., పుదుచ్చేరికి ఆగ్నేయంగా 110 కి.మీ., వేదరన్నియంకి ఈశాన్యంగా 140 కి.మీ., చెన్నైకి దక్షిణ-ఆగ్నేయంగా 180 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల నుంచి దిత్వా తుఫాను కేంద్రం దాదాపు కనీసం 70 కి.మీ దూరంలోఉంది. ఇది  రాబోయే 18 గంటల్లో ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా ఉత్తరం వైపు కదిలే అవకాశం ఉంది. ఉత్తరం వైపు కదులుతూ తమిళనాడు-పుదుచ్చేరి తీరప్రాంతం మధ్యాహ్నానికి కనీసం 60 కి.మీ, సాయంత్రానికి 30 కి.మీ దూరంలో నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంటుంది.

రాష్ట్రంలో 3 రోజులపాటు వర్షాలు 

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాంఈరోజు (నవంబర్ 30): కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 35-45 కి.మీ. వేగంతో, గరిష్టంగా 55 కి.మీ. వేగంతో వీచే అవకాశముంది. 

రేపు (డిసెంబర్ 1): అనేక చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు మరియు ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 35-45 కి.మీ. వేగంతో, గరిష్టంగా 55 కి.మీ. వేగంతో వీచే అవకాశముంది.ఎల్లుండి (డిసెంబర్ 2): కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్
ఈరోజు (నవంబర్ 30): చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు మరియు ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 50-60 కి.మీ. వేగంతో, గరిష్టంగా 70 కి.మీ. వేగంతో వీచే అవకాశముంది.
రేపు (డిసెంబర్ 1): అనేక చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు మరియు ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 35-45 కి.మీ. వేగంతో, గరిష్టంగా 55 కి.మీ. వేగంతో వీచే అవకాశముంది.ఎల్లుండి (డిసెంబర్ 2): కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముంది.

రాయలసీమ
ఈరోజు (నవంబర్ 30): చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు మరియు ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 50-60 కి.మీ. వేగంతో, గరిష్టంగా 70 కి.మీ. వేగంతో వీచే అవకాశముంది.

రేపు (డిసెంబర్ 1): అనేక చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు మరియు ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 35-45 కి.మీ. వేగంతో, గరిష్టంగా 55 కి.మీ. వేగంతో వీచే అవకాశముంది.

ఎల్లుండి (డిసెంబర్ 2): కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maoist Ganesh : ఒడిశాలో ఎన్‌కౌంటర్‌- సెంట్రల్ కమిటీ సభ్యుడుగణేష్ సహా మహిళా మావోయిస్టుల మృతి
ఒడిశాలో ఎన్‌కౌంటర్‌- సెంట్రల్ కమిటీ సభ్యుడుగణేష్ సహా మహిళా మావోయిస్టుల మృతి
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
Govt New Rules: జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
Advertisement

వీడియోలు

Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు
ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoist Ganesh : ఒడిశాలో ఎన్‌కౌంటర్‌- సెంట్రల్ కమిటీ సభ్యుడుగణేష్ సహా మహిళా మావోయిస్టుల మృతి
ఒడిశాలో ఎన్‌కౌంటర్‌- సెంట్రల్ కమిటీ సభ్యుడుగణేష్ సహా మహిళా మావోయిస్టుల మృతి
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
Govt New Rules: జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
Prime Ministerial candidate Priyanka: ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంకకు పెరుగుతున్న మద్దతు - కాంగ్రెస్‌‌లో అంతర్గత సంక్షోభం ఏర్పడనుందా ?
ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంకకు పెరుగుతున్న మద్దతు - కాంగ్రెస్‌‌లో అంతర్గత సంక్షోభం ఏర్పడనుందా ?
Allu Arjun : బన్నీతోనే త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ - మరి ఎన్టీఆర్... ప్రొడ్యూసర్ రియాక్షన్ ఇదే!
బన్నీతోనే త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ - మరి ఎన్టీఆర్... ప్రొడ్యూసర్ రియాక్షన్ ఇదే!
Vijay Hazare Trophy 2025: విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో తొలి రోజు 22 సెంచరీలు నమోదు! ఒకే రోజులో పాత రికార్డు బద్దలు!
విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో తొలి రోజు 22 సెంచరీలు నమోదు! ఒకే రోజులో పాత రికార్డు బద్దలు!
Mahesh Babu : మిల్క్ బాయ్‌లా మహేష్ బాబు - 'వారణాసి' రాముడు రెడీ అవుతున్నాడా?
మిల్క్ బాయ్‌లా మహేష్ బాబు - 'వారణాసి' రాముడు రెడీ అవుతున్నాడా?
Embed widget