Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
Mana Shankara Vara Prasad Garu Update: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో మాస్ సాంగ్ చేస్తే... ఇప్పుడు ఆ కల నెరవేరుతోంది.

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వర ప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu Movie). వరుస విజయాలతో దూసుకు వెళుతున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరు, వెంకీపై పాటను తీస్తున్నారు.
చిరు, వెంకీ కలిసి మాస్ పాటకు స్టెప్పేస్తే!
చిరంజీవి, వెంకటేష్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారనే వార్త వాళ్ళ ఇద్దరి అభిమానులతో ప్రేక్షకులకు సంతోషాన్ని ఇచ్చింది. వాళ్లిద్దరూ కలిసి ఓ పాటకు స్టెప్ వేస్తే చూడాలని ఇంకొందరు కోరుకున్నారు. ఇప్పుడు వాళ్ళ కల నెరవేరుతోంది.
హైదరాబాద్ సిటీలోని ఒక ప్రయివేట్ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో చిరంజీవి, వెంకటేష్ మీద స్టైలిష్ డ్యాన్స్ నంబర్ షూట్ చేస్తున్నారు. ఈ పాట కోసం సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన బీట్స్, మాంచి బాణీతో కూడిన పర్ఫెక్ట్ డ్యాన్స్ నంబర్ కంపోజ్ చేశారు. ఇందులో 500 మందికి పైగా డ్యాన్సర్లు చిరు, వెంకీ వెనుక స్టెప్పులు వేయనున్నారు. ప్రేక్షకులతో పాటు అభిమానులను ఈ పాట ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేయనుందని చిత్ర బృందం చెబుతోంది.
'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాలోని చార్ట్ బస్టర్ ఫస్ట్ సింగిల్ 'మీసాల పిల్ల...' ఆల్రెడీ 72 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఆ పాటకు కొరియోగ్రఫీ చేసిన పొలకి విజయ్, ఇప్పుడు చిరు - వెంకీ పాటకు కూడా కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. త్వరలో చిరంజీవి, నయనతారలపై చిత్రీకరించిన మరొక మెలోడియస్ రొమాంటిక్ సాంగ్ విడుదల చేయడానికి చిత్ర బృందం రెడీ అవుతోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీమతి అర్చన సమర్పకురాలు.
Also Read: Rajendra Prasad: మళ్ళీ నోరు జారిన రాజేంద్రుడు... బ్రహ్మీని పట్టుకుని అలా... ఆ మాటలు ఏమిటండీ?





















