అన్వేషించండి

Rajendra Prasad: మళ్ళీ నోరు జారిన రాజేంద్రుడు... బ్రహ్మీని పట్టుకుని అలా... ఆ మాటలు ఏమిటండీ?

Sahakutumbaanam Trailer Launch: అడుసు తొక్కనేల కాలు కడగనేల అని ఓ సామెత ఉంది. ఇటీవల రాజేంద్రప్రసాద్ వ్యవహార శైలి చూస్తుంటే చాలా మందికి అది గుర్తుకు వస్తోంది. మరోసారి వేదికపై ఆయన నోరు జారారు.

Rajendra Prasad Comments On Brahmanandam: అడుసు తొక్కనేల కాలు కడగనేల - అని తెలుగులో ఓ సామెత ఉంది. నట కిరీటి, డాక్టరేట్ హోల్డర్, సీనియర్ హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్ వ్యవహార శైలి చూస్తుంటే తెలుగు చిత్రసీమలో కొంత మందికి ఆ సామెత గుర్తుకు వస్తోంది. అడుసు తొక్కిన తర్వాత కాలు కడగకుండా తన కాలు శుభ్రంగా ఉందని చెబితే నమ్మడం ఎంత కష్టంగా ఉంటుందో... రాజేంద్రుడు నోరు జారి సమర్ధించుకోవడం కూడా ఆ చందంగా ఉంది.

మళ్ళీ నోరు జారిన రాజేంద్రుడు!
'రాబిన్ హుడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ గుర్తు ఉందా? ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మీద నోరు పారేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్. ఆయన మాటలకు అందరూ నోరెళ్లబెట్టారు. ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో ప్రముఖ నటుడు అలీని అనకూడని మాట అన్నారు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ తీరును ఎండ కడుతూ చాలా మంది విమర్శలు చేశారు. అయితే తనను తాను రాజేంద్రుడు సమర్ధించుకున్నారు. ఆ వివాదాలు మరువక ముందు మరోసారి నటకిరీటి నోరు జారారు. 

'సకుటుంబానాం'... సినిమా పేరు ఎంత చక్కగా, సంప్రదాయబద్దంగా ఉందో కదూ! టైటిల్‌కు తగ్గట్టు చక్కటి కుటుంబ కథా చిత్రాన్ని తీశారు. హీరో రామ్ కిరణ్ దమ్ము కొట్టినట్టు, మందు తగినట్టు చూపించినా... ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా అని అర్థం అవుతోంది. మానవ సంబంధాలు, అనుబంధాలు, ప్రేమ నేపథ్యంలో ఈ సినిమా తీశారని తెలుస్తోంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం కూడా నటించారు. ట్రైలర్ చివరలో ఎమోషనల్ డైలాగ్ చెప్పారు రాజేంద్ర ప్రసాద్. అయితే ట్రైలర్ విడుదల కార్యక్రమంలో మాత్రం నోరు జారారు.

Also Read: Vanavaasam Song Lyrics: వనవాసం సాంగ్ లిరిక్స్... సుమ కనకాల కొడుకు రోషన్ 'మోగ్లీ'లో కొత్త పాట... రామాయణం గుర్తు చేసేలా!

చూశారుగా... 'సకుటుంబానాం' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో స్టేజిపై 'ముసలి ముం... కొడకా' అంటూ బ్రహ్మానందం మీద నోరు జారారు రాజేంద్ర ప్రసాద్. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజేంద్రుడి తీరు బ్రహ్మి నొచ్చుకున్నట్టు వీడియోలు చూస్తుంటే అర్థం అవుతోంది. గతంలో నోరు జారిన తర్వాత తన ప్రవర్తన, వ్యవహార శైలిని సమర్ధించుకున్నట్టు ఈసారి కూడా రాజేంద్రప్రసాద్ సమర్ధించుకుంటారేమో చూడాలి. నలుగురిలో మాట్లాడుతున్న సమయంలో, అందులోనూ ప్రేక్షకుల్లో గుర్తింపు ఉన్న తరుణంలో ఈ విధంగా మాట్లాడటం ఆయన వయసుకు సరి కాదని, గౌరవం తగ్గుతుందని గుర్తిస్తే మంచిది.

Also Read: Revolver Rita Movie Review - 'రివాల్వర్ రీటా' రివ్యూ: డాన్‌గా సునీల్... తెలివిగా బురిడీ కొట్టించిన కీర్తి సురేష్ - కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Advertisement

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget