Pilla Song - Dhandoraa: లవర్ బాయ్‌గా రవికృష్ణ... మనికా చిక్కాలతో స్టెప్పులు... 'దండోరా'లో 'పిల్లా...' సాంగ్ చూశారా?
సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నటుడు రవికృష్ణ. 'విరూపాక్ష' సినిమాలో విలనీగా ఆకట్టుకున్న అతను... ఇప్పుడు 'దండోరా'లో లవర్ బాయ్ రోల్ చేశారు.

తెలుగు బుల్లితెర వీక్షకులకు నటుడు రవికృష్ణ (Actor Ravi Krishna) తెలుగు. పలు సీరియల్స్ ద్వారా ప్రజలను ఆకట్టుకున్నారు. వెండితెరపై సాయి దుర్గా తేజ్ బ్లాక్ బస్టర్ 'విరూపాక్ష'తో అతనికి బ్రేక్ వచ్చింది. ఆ సినిమాలో క్షుద్రపూజలు చేసే వ్యక్తిగా కనిపించారు. ఇప్పుడు 'దండోరా' (Dhandoraa Movie) సినిమాలో అతను లవర్ బాయ్ రోల్ చేశారు. ఆయనపై తీసిన పాటను విడుదల చేశారు.
మనికా చిక్కాలతో రవికృష్ణ స్టెప్పులు!
రవికృష్ణ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న సినిమా 'దండోరా'. ఆయనకు జంటగా మనికా చిక్కాల (Manika Chikkala) నటించారు. వీళ్లిద్దరి మీద తెరకెక్కించిన లవ్ మెలోడీ 'పిల్లా...'ను తాజాగా విడుదల చేశారు.
''దండోరా కొట్టుకుందురో...
గుండెల్లో కొత్తగుందిరో
నింగి నేల ఇలా...
దారి కుదిరిందెలా
కళ్లారా చూడబోతినో...
కల్లోలం లాగ ఉంటదే
దాగి దాగి అలా దగ్గరైపోయావే ఇలా
పిల్లా ఇట్టసూడవే...
తొంగి నన్ను చూడవే'' అంటూ సాగిన ఈ పాటకు మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. అదితి భావరాజు, అనురాగ్ కులకర్ణి పాడారు. పూర్ణాచారి సాహిత్యం అందించారు.
Also Read: Rajendra Prasad: మళ్ళీ నోరు జారిన రాజేంద్రుడు... బ్రహ్మీని పట్టుకుని అలా... ఆ మాటలు ఏమిటండీ?
అమ్మాయి ప్రేమను పొందడం కోసం ఓ అబ్బాయి ఎన్ని కష్టాలు పడ్డాడు? అనేది ఈ పాటలో చూపించారు. రవికృష్ణ, మనికా చిక్కాల వేసిన స్టెప్పులు, వాళ్లిద్దరి కెమిస్ట్రీ బావున్నాయి.
డిసెంబర్ 25న సినిమా విడుదల!
Dhandoraa Release Date: డిసెంబర్ 25న 'దండోరా' ప్రేక్షకుల ముందుకు రానుంది. 'కలర్ ఫొటో', 'బెదురులంక 2012' తర్వాత లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన చిత్రమిది. ఇందులో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు ప్రధాన తారాగణం. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో పరువు హత్యలను ప్రస్తావిస్తూ వినోదాత్మకంగా రూపొందించిన చిత్రమిది.





















