సాయి తేజ్, సంయుక్త జంటగా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించిన సినిమా 'విరూపాక్ష'. ఏప్రిల్ 21న 'విరూపాక్ష' థియేటర్లలో విడుదల అవుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? సాయి తేజ్ టార్గెట్ ఎంత? నైజాంలో సినిమాను రూ. 7 కోట్లకు అమ్మినట్లు తెలిసింది. రాయలసీమ (సీడెడ్) బిజినెస్ రూ. 3.7 కోట్లు జరిగింది. ఆంధ్ర జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ హక్కులు రూ. 8.5 కోట్లకు అమ్ముడు అయ్యాయట. కర్ణాటక, రెస్టాఫ్ ఆఫ్ ఇండియా రైట్స్ మీద కోటిన్నర వచ్చినట్లు సమాచారం. 'విరూపాక్ష' ఓవర్సీస్ రైట్స్ కూడా కోటిన్నరకు విక్రయించారు. మొత్తం మీద 'విరూపాక్ష' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 22.20 కోట్లు అని ట్రేడ్ వర్గాల టాక్. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ముందు ఉన్న టార్గెట్ రూ. 23 కోట్లు! అంత కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. థియేటర్లలో ఈ వారం 'విరూపాక్ష'కు పోటీ లేదు. అందువల్ల, హిట్ టాక్ వస్తే అంత కలెక్ట్ చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు.