హీరోయిన్ ఇలియానా మంగళవారం (ఏప్రిల్ 18) ఉదయం ఆడియన్స్ అందరికీ షాక్ ఇచ్చారు. త్వరలో తాను తల్లిని కాబోతున్నట్లు ఇలియానా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'నా లిటిల్ డార్లింగ్ ని కలవడానికి వెయిట్ చేస్తున్నా. త్వరలో వస్తుంది' అని ఇన్‌స్టాలో ఇలియానా పోస్ట్ చేశారు. ఇండస్ట్రీ జనాలకు ఇలియానా రిలేషన్షిప్ గురించి తెలుసు కనుక షాక్ కాలేదు. కానీ, ఆడియన్స్ షాక్ అయ్యారు. ఇలియానాకు ఎప్పుడు పెళ్లి అయ్యింది? బిడ్డకు తండ్రి ఎవరు? అని నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు. కట్రీనా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్, ఇలియానా మూడేళ్ళ నుంచి డేటింగులో ఉన్నారు. కట్రీనా బర్త్‌డే పార్టీకి ఇలియానా అటెండ్ అయ్యారు. ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో జనాలకు డౌట్ వచ్చింది. కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో సెబాస్టియన్, ఇలియానా రిలేషన్షిప్ ను ఇన్ డైరెక్టుగా కట్రీనా కైఫ్ కన్ఫర్మ్ చేసింది. సెబాస్టియన్ కంటే ముందు ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో ఇలియానా చాలా ఏళ్ళు డేటింగ్ చేశారు. ఆండ్రూతో బ్రేకప్ తర్వాత సెబాస్టియన్ తో ఇలియానా ప్రేమలో పడ్డారు. అదీ సంగతి! (All Images Courtesy : Ileana Instagram)