రాఘవ లారెన్స్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన 'రుద్రన్' తెలుగులో 'రుద్రుడు'గా విడుదలైంది. 

కథ : రుద్ర (రాఘవ లారెన్స్)ది హ్యాపీ లైఫ్. సపోర్టివ్ పేరెంట్స్ ఉన్నారు. మంచి జాబ్ వస్తుంది. 

లవ్ చేసిన అమ్మాయి అనన్య ఓకే చెబుతుంది. ఆల్ హ్యాపీస్ అనుకుంటుండగా... అనుకోని కష్టం ఎదురవుతుంది. 

రుద్రకు ఎదురైన కష్టం ఏమిటి? విశాఖలో డాన్ భూమి (శరత్ కుమార్)కు ఎందుకు ఎదురు తిరిగాడు? అనేది సినిమా 

సినిమా ఎలా ఉంది? పక్కా కమర్షియల్ ఫార్మాటులో సాగే సినిమా 'రుద్రుడు'. ఫస్టాఫ్ అంతా ఏం జరుగుతుందో తెలియదు. 

తెలుగు సినిమాల్లో సీన్లను మిక్సీలో వేసి చూసినట్టు ఉంటుంది ఫస్టాఫ్. ఫైట్స్ తప్ప కథేమీ లేదు. 

సెకండాఫ్‌లో అసలు కథ, ఫ్లాష్‌బ్యాక్ సీన్లు ఆసక్తి కలిగించాయి. పతాక సన్నివేశాలు, సందేశం బావున్నాయి.

రాఘవా లారెర్స్‌ను మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేయడం కోసం చేసిన ప్రయత్నమే 'రుద్రుడు'. అంతా హీరోయిజమే. 

ఫస్టాఫ్ పరమ రొటీన్ అయినా... సెకండాఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. జీవీ ప్రకాష్ మ్యూజిక్, క్లైమాక్స్ సాంగ్ సూపర్.

ఊరమాస్ ఫైట్స్, యాక్షన్ కోరుకునే ప్రేక్షకులు మాత్రమే ఎంజాయ్ చేసే సినిమా 'రుద్రుడు'. మిగతా వాళ్ళు ఆ రుద్దుడు తట్టుకోవడం కష్టమే.