సమంత, దేవ్ మోహన్ జంటగా కాళిదాసు 'శాకుంతలం' ఆధారంగా గుణశేఖర్ తీసిన సినిమా 'శాకుంతలం'. కథ : కణ్వ మహర్షి ఆశ్రమంలో శకుంతలను చూసి దుష్యంతుడు మనసు పడతాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. గంధర్వ వివాహంతో ఒక్కటవుతారు. రాజ్యానికి వెళ్లి రాచ మర్యాదలతో తీసుకు వెళతానని చెబుతాడు మహారాజు ఎన్ని రోజులైనా దుష్యంతుడు రాడు. గర్భవతైన శకుంతల అతని రాజ్యానికి వెళుతుంది. ఆమె తనకు తెలియదంటాడు దుష్యంతుడు. శకుంతలను దుష్యంతుడు మళ్ళీ ఎలా గుర్తు పట్టాడు? ఇద్దరూ ఎలా ఒక్కటి అయ్యారు? అనేది సినిమా. ప్రేక్షకులకు తెలిసిన కథ కావడంతో స్టార్టింగ్ టు ఎండ్ వరకు సినిమాలో ఆసక్తి కలిగించే సీన్లు లేవు. విజువల్ ఎఫెక్ట్స్, త్రీడీ వర్క్స్ అసలు బాలేదు. ఇంత ఘోరమైన వర్క్ మరో సినిమాలో ఉంటుందని చెప్పలేం. దేవ్ మోహన్, సమంత మధ్య కెమిస్ట్రీ కుదరలేదు. ఇద్దరూ పాత్రలకు సెట్ కాలేదు. సామ్ డబ్బింగ్ కూడా మైనస్. బ్రేక్ ముందు మోహన్ బాబు, క్లైమాక్స్‌లో అల్లు అర్హ సీన్లు మాత్రమే కాస్త బెటర్. అలాగే, మణిశర్మ సంగీతం! సమంత కోసం వెళ్ళిన ప్రేక్షకులను 'శాకుంతలం' డిజప్పాయింట్ చేస్తుంది. అర్హ సీన్లు ఊరట ఇస్తాయి.