హాయిగా నవ్వుతున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? పేరు... సిద్ధి ఇద్నాని! సిద్ధి ఇద్నాని ఇప్పుడు గోవాలో ఉన్నారు. అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. సిద్ధి ఇద్నాని తెలుగులో సినిమాలు చేశారు. కమెడియన్ శ్రీనివాసరెడ్డి జోడీగా 'జంబలికిడి పంబ'లో నటించారు. 'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి' అని మరో సినిమా కూడా చేశారు సిద్ధి. నిజంగా సిద్ధి కెరీర్ గురించి జనాలు అనుకున్నది ఒక్కటి... అయినది మరొకటి! గౌతమ్ మీనన్ దృష్టిలో పడటంతో తెలుగు చిన్న సినిమాలు చేసిన సిద్ధి ఇద్నాని కెరీర్ ఒక్కసారిగా మారింది. శింబు హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'లో సిద్ధి నటించారు. సిద్ధిని ఆడిషన్ చేసిన తర్వాత 'హీరోయిన్ నువ్వే' అని గౌతమ్ మీనన్ చెప్పేశారట. తమిళనాట 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' పెద్ద హిట్. దాంతో సిద్ధి ఇద్నాని కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. ఇప్పుడు పెద్ద సినిమాల్లో సిద్ధి ఇద్నానికి అవకాశాలు వస్తున్నాయని సమాచారం. (All Images Courtesy : Siddhi Idnani Instagram)