'బిగ్ బాస్' రియాలిటీ షోతో గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ దివి. ఇప్పుడు భారీ సినిమాల్లో నటిస్తున్నారు. 'బిగ్ బాస్' కంటే ముందు 'శ్రీమంతుడు' సినిమాలో దివి నటించారు. 'బిగ్ బాస్' తర్వాతే ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' టీజర్ వచ్చింది. అందులో దివిని చూశారా? 'పుష్ప 2'లో టీవీ ప్రజెంటర్ రోల్ చేశారు దివి. తనకు అది డ్రీమ్ రోల్ అని ఆమె చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' సినిమాలోనూ దివికి కీలకమైన పాత్ర దక్కింది. సినిమాలతో పాటు దివి వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నారు. 'మా నీళ్ల ట్యాంక్', 'ఏటీఎమ్' వెబ్ సిరీస్ లలో దివి నటించారు. మరికొన్ని సెట్స్ మీద ఉన్నాయి. రీసెంట్ గా దివి శారీల్లో దిగిన ఫోటోలు, రెట్రో స్టైల్ పిక్స్ సోషల్ మీడియాలో ఎక్కువ పోస్ట్ చేస్తున్నారు. 'పుష్ప 2' ఎఫెక్ట్ ఏమో!? 'బిగ్ బాస్' దివి (All Images / Video Courtesy : Divi Vadthya Instagram)