'ధమాకా' విజయం తర్వాత రవితేజ సోలో హీరోగా నటించిన సినిమా 'రావణాసుర'.

'రావణాసుర'కు సుధీర్ వర్మ దర్శకుడు. ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల అవుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగిందంటే?

రావణాసుర నైజాం రైట్స్ రూ. 7 కోట్లు పలికాయి.

ఆంధ్రాలో రావణాసుర సినిమాను 10 కోట్ల రేషియోలో అమ్మారు. 

రావణాసుర సీడెడ్ రైట్స్ రూ. 3 కోట్లకు ఇచ్చారు.

కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ రైట్స్ కలిపితే రూ. 2.20 కోట్లు వచ్చాయట. 

రావణాసుర సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం మీద రూ. 22.20 కోట్లు.

రావణాసుర బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ. 23 కోట్లు కలెక్ట్ చేయాలని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

'ధమాకా' ప్రీ రిలీజ్ బిజినెస్ 18.30 కోట్లు. 'రావణాసుర'కు నాలుగు కోట్లు ఎక్కువే వచ్చాయి. ఇది రవితేజ కెరీర్ బెస్ట్!