'కార్తీక దీపం' సీరియల్ ఆగింది. కానీ, అందులో నటీనటులపై ప్రేక్షకుల అభిమానం ఆగలేదు. 'కార్తీక దీపం'లో డాక్టర్ మోనిత పాత్రలో శోభా శెట్టి నటించారు. సీరియల్ లో శోభా శెట్టి నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ చేశారు. కానీ, రియల్ లైఫ్ లో ఆమె పాజిటివ్ పర్సన్. శోభా శెట్టి నటనతో పాటు ఆమె అందానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. శోభా శెట్టి లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. శోభా శెట్టి చీర కడితే ఎవరైనా సరే చూపు తిప్పుకోలేరని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. 'కార్తీక దీపం' సీరియల్ కాకుండా... 'సూపర్ క్వీన్' రియాలిటీ షోలో కూడా శోభా శెట్టి పార్టిసిపేట్ చేశారు. శోభా శెట్టి యూట్యూబ్ ద్వారా తన పర్సనల్ విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకుంటున్నారు. శోభా శెట్టి కన్నడ అమ్మాయి. కానీ, తెలుగు చాలా బాగా మాట్లాడతారు. శోభా శెట్టి (All Images Courtesy : Shobha Shetty Instagram)