ఇప్పుడు శోభితా ధూళిపాళ పేరు చెబితే జనాలకు ముందుగా అక్కినేని నాగ చైతన్య పేరు గుర్తుకు వస్తోంది. ఆరు నెలలుగా చైతన్య, శోభిత డేటింగ్ చేస్తున్నారని ఫిల్మ్ ఇండస్ట్రీ, సోషల్ మీడియా గుసగుస. డేటింగ్ న్యూస్ మీద ఇటు చైతన్య గానీ, అటు శోభిత గానీ అసలు పెదవి విప్పలేదు. నిజం చెప్పాలంటే... డేటింగ్ రూమర్స్ ను శోభిత అసలు కేర్ చేయడం లేదు. మీడియాలో తన గురించి వస్తున్న వార్తలకు ప్రాముఖ్యం ఇవ్వడం లేదు శోభిత. సినిమాలు, యాక్టింగ్ కెరీర్ మీద శోభిత ధూళిపాళ కాన్సంట్రేట్ చేశారు. లండన్ రెస్టారెంట్ లో చైతుతో రెండు నెలల క్రితం దిగిన ఫోటో వైరల్ అయ్యింది. ఆ తర్వాత చెన్నైలో 'పొన్నియిన్ సెల్వన్ 2'లో మ్యూజిక్ లాంచ్ కి శోభిత అటెండ్ అయ్యారు. చెన్నై నుంచి ముంబై వెళ్లిన శోభిత, అక్కడ ఫ్యాషన్ షోకి అటెండ్ అయ్యారు. (All Images Courtesy : SobhitaD Instagram)