శోభితా ధూళిపాళ పేరు ఈ మధ్య ఎక్కువ వినబడుతోంది... అక్కినేని నాగ చైతన్యతో డేటింగ్ రూమర్స్ అంటూ! నిజానికి ఇప్పుడు శోభితా ధూళిపాళ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. మణిరత్నం దర్శకత్వం వహించిన దృశ్యకావ్యం 'పొన్నియన్ సెల్వన్'లో ఆమె నటించారు. 'పొన్నియన్ సెల్వన్'లో క్వీన్ వానంతి పాత్రలో శోభిత నటించారు. చెన్నైలో బుధవారం రాత్రి 'పొన్నియన్ సెల్వన్ 2' ఆడియో, ట్రైలర్ లాంచ్ ప్రోగ్రామ్ జరిగింది. 'పొన్నియన్ సెల్వన్ 2' ఆడియో విడుదల కార్యక్రమానికి శోభితా ధూళిపాళ ఇలా చీరలో అటెండ్ అయ్యారు. 'పీఎస్ 2' మ్యూజిక్ లాంచ్ కంప్లీట్ కావడంతో చెన్నై నుంచి ముంబైకి శోభిత వెళ్లిపోయారు. చీరలో శోభితా ధూళిపాళ సినిమాలతో పాటు శోభితా ధూళిపాళ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. ఇటీవల ఆమె 'నైట్ మేనేజర్' సిరీస్ చేశారు. శోభితా ధూళిపాళ (All Images Courtesy : Sobhita Dhulipala / Instagram)