ఇదీ తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ లేటెస్ట్ లుక్! భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి రామ్ చరణ్ పుట్టినరోజు పార్టీకి కాజల్ అటెండ్ అయ్యారు. 'మగధీర', 'నాయక్', 'గోవిందుడు అందరివాడేలే'... మూడు సినిమాల్లో రామ్ చరణ్, కాజల్ జంటగా నటించారు. రామ్ చరణ్, కాజల్‌ది హిట్ పెయిర్. చిరంజీవితో 'ఖైదీ నంబర్ 150' కూడా చేశారు. రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి కాజల్ దంపతులకు కూడా ఇన్విటేషన్ అందింది. అబ్బాయి నీల్ కిచ్లూను ఇంట్లో నిద్రపుచ్చి కాజల్, గౌతమ్ దంపతులు పార్టీకి వచ్చినట్లు ఉన్నారు. 'పేరెంట్స్ నైట్ అవుట్' అంటూ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో కాజల్ షేర్ చేశారు. పెళ్లి తర్వాత కూడా కాజల్ అందం ఏమాత్రం తగ్గలేదనేది ఆమె అభిమానులు చెప్పే మాట ప్రస్తుతం బాలకృష్ణకు జోడీగా అనిల్ రావిపూడి సినిమాలో కాజల్ యాక్ట్ చేస్తున్నారు. బాలకృష్ణ సినిమా షూటింగ్ కోసం కాజల్ హైదరాబాద్ లో ఉన్నారు. భర్త గౌతమ్ కిచ్లూతో కాజల్ (All Images Courtesy : Kajal Aggarwal Instagram)