రామ్ చరణ్ సోమవారం రాత్రి తన బర్త్ డే పార్టీ ఇచ్చారు. భార్యతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఫొటోలో ఉపాసన బేబీ బంప్ చూశారా? చాలా క్లియర్ గా కనబడుతోంది కదా! ఉపాసన, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు ఈ ఏడాది తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇప్పుడు ఉపాసన ఆరు నెలల గర్భవతి. ఆస్కార్ ఇంటర్వ్యూల్లో చరణ్ ఆ విషయం చెప్పారు. ఉపాసన డెలివరీ డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కానీ, ఇండియాలో డెలివరీకి ఏర్పాట్లు చేస్తున్నారు. అపోలో ఆస్పత్రిలో ఇక్కడి వైద్యులతో పాటు విదేశీ వైద్యుల పర్యవేక్షణలో డెలివరీ కానుంది. చరణ్, ఉపాసన తొలి సంతానం అబ్బాయా? అమ్మాయా? అనే చర్చ కూడా మొదలైంది. భార్య ఉపాసనతో బర్త్ డే పార్టీలో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన రామ్ చరణ్ చరణ్ బర్త్ డే పార్టీలో రాజమౌళి, వెంకటేష్, కాజల్ అగర్వాల్ చరణ్ బర్త్ డే పార్టీలో నాగార్జున ఫ్యామిలీ, రానా, విజయ్ దేవరకొండ (All Images Courtesy : Manav Manglani)