నేషనల్ క్రష్ రష్మిక ఇప్పుడు ముంబైలో ఉన్నారు. హిందీ సినిమాలూ చేస్తున్నారుగా! అందుకే, అక్కడికి ముంబై ఎయిర్ పోర్టులో కెమెరా కంటికి రష్మిక ఇలా చిక్కారు. రష్మిక డ్రస్ ను ఒక్కసారి క్లియర్ గా చూడండి. ఎక్కడో చూసినట్టు ఉందా? నితిన్ జోడిగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో చేస్తున్న లేటెస్ట్ సినిమా ఓపెనింగ్ కి ఈ డ్రస్ లో రష్మిక వచ్చారు. నితిన్ సినిమా ఓపెనింగ్ నుంచి నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లినట్టు ఉన్నారు రష్మిక. పాపం రష్మిక... ఓపెనింగ్ తర్వాత ఆమెకు డ్రెస్ చేంజ్ చేసుకునే టైమ్ దొరికినట్టు లేదు. ఓపెనింగుకు ఏ డ్రస్ లో వచ్చారో... ముంబైకి కూడా అదే డ్రస్ లో వెళ్లారు. బ్లాక్ కళ్ళజోడు పెట్టి కొంచెం స్టయిలిష్ లుక్ ఇచ్చారు రష్మిక. నితిన్ సినిమా కాకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2'లో కూడా రష్మిక నటిస్తున్నారు. రష్మిక (All Images Courtesy : manav manglani)