రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం 'రావణాసుర'. మాస్ మహారాజా విలనిజం ఎలా ఉందంటే? కథ : క్రిమినల్ లాయర్ కనక మహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా) దగ్గర రవీంద్ర (రవితేజ) జూనియర్. తన తండ్రికి తెలియకుండా ఓ కేసులో ఇరుక్కున్నారని హారిక (మేఘా ఆకాష్) వస్తే రవీంద్ర బలవంతం మీద ఆ కేసును మహాలక్ష్మి తీసుకుంటుంది. తర్వాత హారిక మర్డర్ అవుతుంది. సిటీ కమిషనర్ కూడా! మర్డర్స్ ఎవరు, ఎందుకు చేశారు? పోలీసులు పెట్టుకున్నారా? లేదా? అనేది కథ. ఎలా ఉందంటే? రవితేజ విలనిజం చూపించడం కోసం సినిమా తీసినట్టు ఉంది. కథలో కంటెంట్ లేదు. 'రావణాసుర' ఆసక్తిగా మొదలైంది. ఇంటర్వెల్ ముందు, వెనుక బావుంది. మెయిన్ ట్విస్ట్ రివీల్ చేశాక రొటీన్ అయిపొయింది. తెలుగులో ఇటువంటి నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. ఇందులో ఏం కొత్తదనం ఉందని రవితేజ ఓకే చేశారో మరి? హీరోయిన్లు ఎవరికీ సరైన ఇంపార్టెన్స్ లేదు. సాంగ్స్ అసలు బాలేదు. నేపథ్య సంగీతం ఓకే. రవితేజ యాక్టింగ్ బావుంది. డ్యాన్సులు బాగా చేశారు. ఫరియా, ఆదితో కామెడీ సీన్లు బావున్నాయి. కానీ, కథే లేదు. సుశాంత్ బాగా చేశాడు. కానీ, ఆయనకు కథలో అంత ఇంపార్టెన్స్ లేదు. రవితేజకు తప్ప ఎవరికీ సరైన క్యారెక్టర్ లేదు. రవితేజ కోసం ఆయన వీరాభిమానులు ఎవరైనా వెళితే వెళ్ళవచ్చు. సగటు ప్రేక్షకులు సినిమాను లైట్ తీసుకోవచ్చు.