స్టార్ యాంకర్, యాక్ట్రెస్ రష్మీ గౌతమ్ ఇప్పుడు హాలిడేలో ఉన్నారు. బీచ్ వెకేషన్ వేశారు. బీచ్‌లో ముద్దులు ఇస్తున్న రష్మీ అంటే ఎవరికో అనుకునేరు. సోషల్ మీడియాలో తన ఫాలోయర్లకు ఆమె ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. రష్మీ గౌతమ్ తాను ఎక్కడికి వెళ్లిందీ చెప్పలేదు. అయితే, ఫోటోలు చూస్తుంటే ఫారిన్ ట్రిప్ వేశారని తెలుస్తోంది. షార్ట్, లూజ్ షర్ట్, తల మీద క్యాప్... డ్రస్సింగ్ సింపుల్ గా ఉంచారు రష్మీ గౌతమ్. రష్మీ గౌతమ్ మేకప్ కూడా వేసుకోలేదు. ఎప్పుడూ షూటింగ్స్ కోసం ఎలాగో మేకప్ ఉంటుంది కాబట్టి హాలిడేలో తీసేశారేమో!? ప్రస్తుతం 'ఎక్స్ట్రా జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలకు రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేస్తున్నారు. టీవీ షోలతో పాటు రష్మీ గౌతమ్ సినిమాలు కూడా చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' సినిమాలో రష్మీ గౌతమ్ ఓ క్యారెక్టర్ చేస్తున్నారు. మేకప్ లేకుండా రష్మీ గౌతమ్ (All Images Courtesy : Rashmi Gautam Instagram)