ఫిట్నెస్ అంటే ప్రాణం ఇచ్చే కథానాయికలలో జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఒకరు. ఎవరో శిల్పి చెక్కినట్లు అందమైన శరీరాకృతితో జాక్వలిన్ ఫెర్నాండేజ్ ప్రేక్షకుల మనసు దోచుకుంటారు. జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఫిగర్ వెనుక ఆమె పడిన కష్టం కొంత మందికి మాత్రమే తెలుసు. జాక్వలిన్ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. ఒక్క రోజు కూడా మిస్ అవ్వడం ఉండదు. చెమట చిందించాల్సిందే. ఏరియల్ యోగా, హార్స్ రైడింగ్, జిమ్ వంటివి జాక్వలిన్ డైలీ వర్కవుట్ రొటీన్ లో ఓ భాగం. వర్కవుట్స్ కంప్లీట్ చేసిన తర్వాత జాక్వలిన్ పోస్ట్ చేసిన ఓ ఫోటో జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ కారణంగా ఇటీవల జాక్వలిన్ పేరు తరచూ వార్తల్లో వినబడుతూ ఉంది. ఈస్టర్ రోజున జాక్వలిన్ కు శుభాకాంక్షలు చెబుతూ సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాసినట్లు సమాచారం. మీడియా ముందుకు వస్తున్న జాక్వలిన్ సినిమాల గురించి తప్ప సుఖేష్ గురించి మాట్లాడటం లేదు. జాక్వలిన్ ఫెర్నాండేజ్ (All Images Courtesy : Jacqueline Fernandez Instagram)