అన్వేషించండి

KTM 390 Adventure పవర్‌, మైలేజ్‌, ఆన్‌రోడ్‌ ధరలు: యంగ్‌ రైడర్ల కోసం 5 కీలక వివరాలు

KTM 390 Adventure కొనాలనుకుంటున్నారా? ఇంజిన్ పవర్‌, సీట్ హైట్‌, మైలేజ్‌, గ్రౌండ్ క్లియరెన్స్‌, హైదరాబాద్‌, విజయవాడ ఆన్‌రోడ్ ధరలతో పూర్తి గైడ్.

KTM 390 Adventure Bike Price: అడ్వెంచర్ టూరింగ్ బైక్ కొనాలనుకునే రైడర్ల లిస్ట్‌లో KTM 390 Adventure పేరు ఎప్పుడూ ముందుంటుంది. శక్తిమంతమైన ఇంజిన్‌, ఆధునిక ఫీచర్లు, ఆఫ్‌రోడ్ సామర్థ్యం – ఇవన్నీ కలిపి ఇది తన సెగ్మెంట్‌లో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఇటీవల GST సవరణల తర్వాత ధర కొంచెం పెరిగినా, ఇప్పటికీ ఈ బైక్‌పై ఆసక్తి తగ్గలేదు. అయితే కొనే ముందు కొన్ని కీలక విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి. అందుకే KTM 390 Adventure గురించి ఎక్కువగా అడిగే 5 ముఖ్య ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ తెలుసుకుందాం.

1. KTM 390 Adventure ఇంజిన్ పవర్ ఎంత?

KTM 390 Adventureలో 399cc, సింగిల్ సిలిండర్‌, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇదే ఇంజిన్ KTM 390 Duke, 390 Enduro మోడళ్లలో కూడా ఉంది. ఈ ఇంజిన్ 8,500rpm వద్ద 46hp పవర్‌ను, 6,500rpm వద్ద 39Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హైవే క్రూజింగ్ అయినా, ఆఫ్‌రోడ్ రైడింగ్ అయినా ఈ ఇంజిన్ ఎప్పుడూ ఉత్సాహంగా స్పందిస్తుంది. ముఖ్యంగా ఓవర్‌టేకింగ్ సమయంలో, లోడ్‌తో ప్రయాణిస్తున్నప్పటికీ పవర్ తక్కువ అనిపించదు.

2. KTM 390 Adventure సీట్ హైట్ ఎంత?

ఈ బైక్ 830mm సీట్ హైట్‌తో వచ్చింది. అంటే, ఇది కొంచెం ఎత్తైన బైక్ అన్నమాట. 5.7 అడుగుల కంటే తక్కువ ఎత్తు ఉన్న రైడర్లు ఈ బండిపై ఎక్కితే, సిటీ ట్రాఫిక్‌లో కాళ్లు పూర్తిగా నేలపై పెట్టడం కొద్దిగా కష్టంగా అనిపించవచ్చు. అయితే అడ్వెంచర్ బైక్‌లకు ఇది సాధారణమే. హైవేలు, లాంగ్ రైడ్స్‌లో ఈ ఎత్తు పెద్ద సమస్యగా అనిపించదు.

3. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, మైలేజ్ ఎంత?

KTM 390 Adventureలో 14.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఎక్స్‌పర్ట్‌లు చేసిన రియల్ వరల్డ్ టెస్టుల్లో ఈ బైక్ సిటీలో లీటర్‌కు 26.94 కిలోమీటర్లు , హైవే మీద లీటర్‌కు 35.5 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చింది. దీని ఆధారంగా చూస్తే, ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే సుమారు 400 నుంచి 450 కిలోమీటర్ల వరకు రేంజ్ సాధించవచ్చు. లాంగ్ టూరింగ్ చేసే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

4. గ్రౌండ్ క్లియరెన్స్‌, సస్పెన్షన్ ట్రావెల్ ఎంత?

KTM 390 Adventureలో...

237mm గ్రౌండ్ క్లియరెన్స్

ముందు సస్పెన్షన్ ట్రావెల్ – 200mm

వెనుక సస్పెన్షన్ ట్రావెల్ – 205mm 

బ్యాడ్‌ రోడ్స్‌, గుంతలు, రఫ్ ట్రాక్స్ వంటివి ఏవీ ఈ బైక్‌కు పెద్దగా ఇబ్బంది కావు. మోస్తరు ఆఫ్‌రోడ్ సెక్షన్లలో కూడా ఇది ధైర్యంగా దూసుకుపోతుంది.

5. KTM 390 Adventure ధర ఎంత? (AP & Telangana)

ఎక్స్‌-షోరూమ్‌ ధర (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ) - ₹3.95 లక్షలు

విజయవాడలో ఆన్‌రోడ్ ధర

RTO: ₹48,888

ఇన్సూరెన్స్ (Comprehensive): ₹24,030

ఆన్‌రోడ్ ధర: ₹4,67,814

హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర

ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹3.95 లక్షలు

ఇన్సూరెన్స్ (Zero Depreciation): ₹26,464

RTO & ఇతర చార్జీలు: ₹74,992

ఎక్స్‌టెండెడ్ వారంటీ: ₹2,599

AMC: ₹2,199

స్టాండర్డ్ యాక్సెసరీస్: ₹1,450

ఆన్‌రోడ్ ధర: ₹5,02,075

ముగింపు

KTM 390 Adventure అనేది కేవలం సిటీ బైక్ కాదు. ఇది నిజమైన అడ్వెంచర్ టూరింగ్ మెషీన్‌. పవర్‌, సస్పెన్షన్‌, గ్రౌండ్ క్లియరెన్స్‌, రేంజ్ అన్నింట్లో బ్యాలెన్స్ కావాలనుకునే రైడర్లకు ఇది సరైన ఎంపిక. అయితే సీట్ హైట్‌, ధర అంశాలను ముందే ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మరింత సంతృప్తికరంగా ఉంటుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Karthika Deepam 2 Serial Today August 13th: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ ఎవరిది? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ కోసం బిగ్ ఫైట్? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
Embed widget