Gold Smuggling Case:నటి రన్యా బంగారం అక్రమ రవాణా కేసులో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం- సెలవుపై డిజిపి రామచంద్రరావు
Gold Smuggling Case:బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యా రావు తండ్రిపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మరోవైపు తనపై తప్పుడు కేసు పెట్టారని నటి వాదిస్తోంది.

Ranya Rao Gold Smuggling Case: బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన నటి రన్యా రావు సవతి తండ్రి, డీజీపీ రామచంద్రరావు సమస్యల్లో చిక్కుకున్నారు. ఈ కేసు కారణంగా ఆయన్ని కంపల్సరీ లీవ్‌పై కర్ణాటక ప్రభుత్వం పంపించింది. తనపై పెట్టింది తప్పుడు కేసు అని రన్యారావు బెంగళూరులోని DRI ఏడీజీకి రాసిన లేఖలో ఆరోపించింది.
డిఆర్ఐపై రన్యా రావు ప్రశ్నలు
మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారంతో రన్యారావు దొరికిపోయి అరెస్టు అయ్యారు. ఇది తప్పుడు కేసుగా అభివర్ణిస్తూ రన్యారావు బెంగళూరులోని డిఆర్‌ఐ అదనపు డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు తనను కొట్టారని, కొన్ని ఎంప్టీ పేపర్లపై సంతకాలు బలవంతం చేయించుకున్నారని ఆరోపించాడు.
కస్టడీలోకి తీసుకున్నప్పటి నుంచి కోర్టులో హాజరుపరిచే వరకు తనను 10 నుంచి 15 సార్లు చెంపదెబ్బ కొట్టారని నటి ఆరోపించారు. "నన్ను పదే పదే చెంపదెబ్బలు కొట్టినప్పటికీ, వారు (డిఆర్ఐ అధికారులు) తయారుచేసిన స్టేట్‌మెంట్‌పై సంతకం చేయడానికి నేను నిరాకరించాను" అని ఆమె ఆరోపించింది. "నేను సంతకం చేయకపోతే, ఆయన ప్రమేయం లేదని తెలిసినప్పటికీ నా తండ్రి పేరు, ఇతర వివరాలు వెల్లడిస్తామని అధికారి ఒకరు బెదిరించారు" అని రన్యా రావు పేర్కొన్నారు.
రన్యారావు బెయిల్ పిటిషన్ తిరస్కరణ
రన్యారావు ప్రస్తుతం జైలులో ఉన్నారు. శుక్రవారం బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆమె బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో బెయిల్ వచ్చే వరకు అక్కడే ఉండాల్సి ఉంటుంది. రన్యారావుకు సంబంధించిన బంగారం అక్రమ రవాణా కేసు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినదని, దీనికి హవాలా సంబంధం కూడా ఉందని డిఆర్‌ఐ గతంలో కోర్టుకు తెలిపింది. దీని కారణంగా ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా మారింది. ఈ స్మగ్లింగ్ ముఠా పాత్రపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు.
కూతురు బంగారు స్మగ్లింగ్ కార్యకలాపాల్లో సవతి తండ్రి రామచంద్రరావు పాత్రపై దర్యాప్తు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం మార్చి 10న అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తాను నియమించింది. విమానాశ్రయంలో పోలీసు అధికారుల నిర్లక్ష్యంపై రాష్ట్ర ప్రభుత్వం సిఐడి దర్యాప్తుకు ఆదేశించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

