Pawan Kalyan on Tamilnadu Language Fight | హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీలో మాట్లాడి మేటర్ చెప్పిన పవన్
దేశంలో తమిళనాడు సహా ఏ రాష్ట్రానికైనా ఒకటే సిద్ధాంతం ఉండాలని అది బహు బాషా సిద్ధాంతమే కావాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్..హిందీ భాషపై తమిళనాడులో జరిగిన రాద్ధాంతం మీద తన అభిప్రాయం చెప్పారు. ఇందుకోసం జనసేన కు ప్రజలు అందించిన విజయంపై తమిళం, కన్నడ, హిందీ, మరాఠీల్లో ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత ఇలా ఇన్ని రాష్ట్రాల వాళ్లకు ధన్యవాదాలు చెప్పుకోవాలన్నా చాలా భాషలు వచ్చి ఉండాలన్న పవన్ కళ్యాణ్...బహుభాషా సిద్ధాంతమే దేశం మొత్తం ఐక్యంగా ఉండేలా చేయగలిగే సత్తా ఉంటుందన్నారు. దీని కోసం తమిళనాడు సీఎం స్టాలిన్ డీఎంకే పార్టీ తరపున నిర్వహిస్తున్న ఆఖిల పక్ష సమావేశంపైనా తన స్పష్టమైన అభిప్రాయం చెప్పకనే చెప్పారు పవన్ కళ్యాణ్. ఫలితంగా ఏపీ నుంచి కూటమిలో ఉన్న రెండో పార్టీ కూడా మల్టిపుల్ లాంగ్వేజ్ పై తన అభిప్రాయాన్ని చెప్పేసినట్లైంది





















