అన్వేషించండి

Nagarjuna Akkineni : నాగార్జున 100వ సినిమాకు తమిళ్ దర్శకుడు... షూటింగ్ ఎప్పటి నుంచి అంటే ?

Nagarjuna Akkineni : నాగార్జున 100వ సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయి. ఓ ప్రముఖ తమిళ దర్శకుడు చెప్పిన స్టోరీకి నాగార్జున ఫిదా అయ్యాడని, త్వరలోనే అఫిషియల్ అనౌన్స్మెంట్ రానుందని ప్రచారం జరుగుతోంది.

టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున చివరగా 'నా సామిరంగా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో సూపర్ హిట్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీ ఇచ్చిన జోష్ తో నాగార్జున వరుస సినిమాలతో బిజీ కానున్నారు అని అందరూ అనుకున్నారు. కానీ నాగార్జున మాత్రం సైలెంట్ గా సైడ్ క్యారెక్టర్లు చేస్తూ బిజీ అయిపోయారు. ప్రస్తుతం నాగ్ రెండు భారీ సినిమాలలో గెస్ట్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాగార్జున 100వ సినిమాకు డైరెక్టర్ కన్ఫామ్ అయ్యారనే వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. 

తమిళ దర్శకుడితో నాగార్జున 100వ మూవీ ?
అక్కినేని నాగార్జున కెరీర్లో మైలురాయిగా మారబోతున్న 100వ సినిమా గురించి ఆయన అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటిదాకా నాగ్ నెక్స్ట్ మూవీ గురించి ఏ విషయం అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. ఇటీవల కాలంలోవరుస డిజాస్టర్లు పడుతుండడంతో టాలీవుడ్ కింగ్ సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించిన విషయం విధితమే. లేటుగా అయినా సరే లేటెస్ట్ గా అన్నట్టుగా ప్రేక్షకులను ఆకట్టుకునే కథలతోనే థియేటర్లలోకి వస్తున్నారు ఈ సీనియర్ హీరో. 'బంగార్రాజు' తర్వాత నాగార్జున చేసిన 'ది ఘోస్ట్' మూవీ దారుణంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో మళ్లీ తనకు కలిసి వచ్చిన రొమాంటిక్ అండ్ యాక్షన్ జానర్లోనే 'నా సామరంగా' మూవీతో ప్రేక్షకులను అలరించారు నాగార్జున. ఆయన కెరీర్లో 99 వరకు మూవీ రూపొందిన ఈ మూవీ డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. 

ఈ నేపథ్యంలోనే సోలో హీరోగా తాను నటించే 100వ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అందుకే ఆచితూచి ఈ సినిమా కోసం డైరెక్టర్, స్టోరీని సెలెక్ట్ చేసుకుంటున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆర్ఏ కార్తీక్ అనే తమిళ దర్శకుడు నాగార్జునకు స్టోరీ చెప్పినట్టు తెలుస్తోంది. ఆయన చెప్పిన స్టోరీ నచ్చడంతో నాగ్ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఓ బడా ప్రొడ్యూసర్ నాగార్జున 100వ సినిమాను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇక కార్తీక్ ఇంతకు ముందు తమిళంలో 'నితం ఓరు వానం' అనే మూవీకి దర్శకత్వం వహించారు. ఇందులో అశోక్ సెల్వన్ త్రిపాత్రాభినయం చేశారు. కాగా నాగార్జునతో ఈసారి డైరెక్టర్ కార్తీక్ ఓ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ చేయబోతున్నారని, త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందని అంటున్నారు. 

'బిగ్ బాస్'కు నాగార్జున బ్రేక్ 
నిజానికి నాగార్జున నెక్స్ట్ మూవీ విషయంలో తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా, నవీన్ అనే మరో యంగ్ డైరెక్టర్ పేర్లు వినిపించాయి. ఇప్పుడు మరో కొత్త డైరెక్టర్ పేరు ఈ లిస్టులో చేరింది. ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తేనే గాని నాగార్జున నెక్స్ట్ సినిమాకు డైరెక్టర్ ఎవరు అన్న విషయంపై క్లారిటీ రాదు. ఇదిలా ఉండగా, నాగార్జున ప్రస్తుతం కుబేర, కూలీ అని రెండు బడా బడ్జెట్ సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయ్యాకే ఆయన 100వ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇక ఈ రెండు సినిమాల కోసం నాగార్జున భారీ రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేసినట్టు సమాచారం. అంతేకాదు ఇప్పటిదాకా తను హోస్ట్ చేసిన 'బిగ్ బాస్' షో నుంచి బ్రేక్ తీసుకుని, సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని నాగ్ నిర్ణయించుకున్నట్టు టాక్ నడుస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
FOMO: వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
Embed widget