Vishnu Manchu: స్టార్ హీరో భార్య, పిల్లలపై ట్రోలింగ్... పర్సనల్‌గా ఇన్సల్ట్... విష్ణు మంచు కోర్టుకు వెళ్ళడం వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా?
Manchu Vishnu On Trolling: విష్ణు మంచు తనపై తన కుటుంబం పై జరుగుతున్న ట్రోలింగ్ పై చట్టపరమైన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మంచు విష్ణు ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకున్నారో వెల్లడించారు.

కొన్ని రోజుల క్రితం విష్ణు మంచు, ఆయన కుటుంబ సభ్యుల మీద విపరీతమైన ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి మరీ ట్రోలర్స్ పై చర్యలు తీసుకున్నారు. తాజాగా విష్ణు మంచు 'కన్నప్ప' మూవీ ప్రమోషన్ల సందర్భంగా ట్రోలింగ్ పై ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికి గల కారణాలు ఏంటో వెల్లడించారు.
డబ్బులు వస్తున్నాయని నెగెటివ్ వీడియోలు
తాజాగా 'కన్నప్ప' మూవీ ప్రమోషన్లలో భాగంగా మంచు విష్ణు మాట్లాడుతూ "మా మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ టైంలో ఈ ట్రోలింగ్ అంతా మొదలైంది. అప్పటికే మా వాళ్ళు ఇలా ట్రోలింగ్ జరుగుతుందని చెప్పినప్పటికీ, ఇదంతా కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారులే అని సర్దుకున్నాను. కానీ అసలు ఏం జరిగిందంటే... నా గురించి లేదా నాన్నగారి గురించి యూట్యూబ్లో ఏదైనా న్యూస్ వస్తే వ్యూస్ బాగా పెరిగేవి. అయితే ఇలాంటి కంటెంట్ పెడితే డబ్బులు వస్తున్నాయి అనే ఆలోచనతో వాళ్ళు మరిన్ని నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టారు. జిన్నా మూవీ తర్వాత నేను రియలైజ్ అయ్యాను. జెన్యూన్ గా వాళ్ళు నన్ను హేట్ చేయట్లేదు. మనీ ఎర్న్ చేయడానికి నెగటివ్ వేను సెలెక్ట్ చేసుకున్నారు. అందుకే నేను కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నాను. ఒకవేళ నిజంగానే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే కచ్చితంగా కంటిన్యూ చేయొచ్చు. కానీ అలాంటిదేమీ లేకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి అనుకుంటే అది తప్పు. మేము నటీనటులం కాబట్టి, పబ్లిక్ లైఫ్ లో ఉంటాం కాబట్టి మీరు ఏదైనా అనవచ్చు. కానీ మా ఫ్యామిలీ విషయానికొస్తే అస్సలు ఒప్పుకోను" అంటూ విష్ణు క్లారిటీ ఇచ్చారు.
సూపర్ స్టార్ భార్య కూతురుపై ట్రోలింగ్
ఆయన ఇంకా మాట్లాడుతూ "అలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక బిగ్గెస్ట్ స్టార్ వైఫ్, కూతురు గురించి మాట్లాడారు. పేర్లు చెప్పను... కానీ అది నన్ను చాలా హర్ట్ చేసింది. నేను ఆ నటుడితో మాట్లాడినప్పుడు ఏంటయ్యా నువ్వు ఉండి కూడా చూసుకోవు అన్నారు. అంతకంటే ముందు ఇలాంటి కాల్స్ ఐదారు వచ్చాయి. కోట శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి రేయ్ ఏంటి నాన్న ఇది? వీడెవడో నేను పోయాను అని రాశాడు. మా అక్క పెద్దావిడ ఈ న్యూస్ చూసి మంచం పట్టింది. వీళ్ళందర్నీ నువ్వు ఏం చేయలేవా? నువ్వు ఏదో ఒకటి చేస్తావని కదా నిన్ను అక్కడ కూర్చోబెట్టింది అందరం... అనేసరికి నాకు పర్సనల్ గా ఇన్సల్ట్ గా అనిపించింది. అందుకే నేను 48 గంటల్లో వీడియో తీయకపోతే కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాను. ఇక ఈ ఫైట్ ని న్యాయపరంగా జరపడానికి నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. లక్షలక్షలు నేను నా ఓన్ గానే ఖర్చు పెట్టాను. అయితే ఈ ట్రోలింగ్ ను మొత్తం అరికట్టలేదు. కానీ కొంతవరకు అయితే స్టాప్ చేయగలిగాను" అంటూ అసలేం జరిగిందో వెల్లడించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

