అన్వేషించండి

Telangana Latest News: తెలంగాణలోకి కూటమి ఎంట్రీ పక్కా! సిగ్నల్ ఇచ్చిన పవన్ 

Telangana Latest News: తెలంగాణ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూటమి పోటీకి సిద్ధమవుతోందా? పవన్ పంపించిన సిగ్నల్స్ ఏంటీ? గత కొన్ని నెలలుగా తెలంగాణలో సాగుతున్న రాజకీయం ఏంటీ?

Telangana Latest News: జయకేతనం పేరిట పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సమావేశంలో పవన్ కల్యాణ్‌ చాలా విషయాలపై స్పందించారు. ప్రత్యర్థుల విమర్శలకు కౌంటర్ ఇస్తూనే  పార్టీ భవిష్యత్ కార్యచరణపై స్పష్టమైన సంకేతాలు పంపారు. రేపటి భవిష్యత్‌లో తెలంగాణ, తమిళనాడులో పోటీ ఖాయమనేలా పవన్ ప్రసంగం సాగింది. 

తెలంగాణలోకి ఎంట్రీ అవ్వడానికి బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలు ఫలించేలా గతేడాది ఎంపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది.  ఈ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అనూహ్యంగా పుంజుకుంది. ఇప్పుడు తన ఫోకస్ లోకల్‌బాడీ ఎన్నికలపై పెట్టింది. ఈ టైంలో పవన్ కల్యాణ‌్ చేసిన ప్రసంగం ఆసక్తిి రేపిస్తోంది. 

జనసేనాని తన ప్రసంగాన్ని తెలంగాణ ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య చెప్పిన పంక్తులతో ప్రారంభించారు. ‘‘రుద్రవీణ వాయిస్తా....అగ్నిధార కురిపిస్తా... తిరుగుబాటు జెండా ఎగురేస్తా... దుష్టపాలన నుంచి విముక్తి కలిగిస్తా’’ అనేదే జనసేనకు బలమని చెప్పుకొచ్చారు. జనసేన పుట్టింది తెలంగాణలోనేని గుర్తు చేశారు. గద్దర్ గురించి ప్రస్తావించారు. గతంలో ఎంఐఎం చేసిన కామెంట్స్‌ను తప్పుపట్టారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడి సభపైకి పిలిచి సన్మానం చేశారు.  

తెలంగాణ తనకు పునర్జన్మ ఇచ్చిందని జనసేననాని చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యం టైంలో విద్యత్‌ షాక్‌ తగిలితే కొండగట్టు ఆంజనేయస్వామి దయతో బతికానంటూ గుర్తు చేశారు. చాలా అంశాల్లో తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు. దీంతో తెలంగాణలో పార్టీ విస్తరణ ఖాయమేనంటూ సంకేతాలు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో అనుసరించిన ఫార్ములా తెలంగాణలో కూడా కూటమి అనుసరించనుందని ఎప్పటి నుంచో పుకార్లు వస్తున్నాయి. టీడీపీ సైలెంట్‌గా నాయకులను సిద్ధం చేస్తోంది. వివిధ పార్టీల్లో ఉన్న నాయకులతో సంప్రదింపులు జరుగుతున్నట్టు విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీ ఎలాగో ఇక్కడ స్ట్రాంగ్ అయ్యేందుకు రెడీ అవుతుంది. ఇప్పుడు జనసేన కూడా సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో మరికొన్ని రోజుల్లో ఏపీలో విజయం సాధించిన కూటమిని తెలంగాణలో చూడబోతున్నామనే వాదన బలపడుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికల నాటికే తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. ఇవి చిన్న ఎన్నికలే అయినా పార్టీ బలోపేతానికి చాలా ఉపయోగపడతాయి. అందుకే ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ, టీడీపీ, జనసేన భావిస్తున్నట్టు సమాచారం. దీని బట్టి చూస్తే తెలంగాణలో మరికొన్ని నెలల్లో పొలిటికల్‌ హీట్‌ పెరగనుందని అర్థమవుతోంది. 

కూటమి రాకను ముందే గ్రహించిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ విమర్శలు అందుకున్నాయి. ఆంధ్రా పాలకులు మళ్లీ తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తున్నారని తిప్పి కొట్టాలని సెంటిమెంట్‌ను రాజేస్తున్నాయి. ఈ మధ్య పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్చంద్రబాబుపై ఇలాంటి విమర్శలే చేశారు. రెండు రోజుల క్రితం కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget