Pawan Kalyan on his Ideology | పూటకో పార్టీతో ఉంటావనే వాళ్లకు ఇదే నా ఆన్సర్ | ABP Desam
ఒక్కోసారి ఒక్కో ఐడియాలజీతో ఉంటావని తన మీద వార్తలు రాస్తున్నారని..ప్రధానంగా నేషనల్ మీడియా ఇటీవల రాసిన లెఫ్ట్, రైట్, సెంటర్ అంటూ రాసిన ఆర్టికల్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. లెఫ్ట్, బీజేపీ, టీడీపీ, బీఎస్పీ ఇలా ఒక్కోసారి ఒక్కో పార్టీ తో ఉండాల్సి రావటంపైనా మాట్లాడారు పవన్ కళ్యాణ్. దేశంలో తనలా అన్ని వర్గాల రాజకీయ పక్షాల నుంచి మంచి విషయాలను తీసుకున్న రాజకీయ నాయకుడు మరొకరు లేరు అన్నారు పవన్ కళ్యాణ్. అప్పటి పరిస్థితులకు దేశకాలమానాలకు అనుగుణంగా సామరస్య పూర్వక ధోరణిలో ప్రజాస్వామ్య యుతంగానే తన నిర్ణయాలు ఉంటాయనన్నారు. ఒకవేళ తన నిర్ణయాలు తప్పైతే ప్రజలు తన వెనుక ఉండేవారు కాదన్న పవన్ కళ్యాణ్ పదకొండేళ్లుగా తాను పార్టీని నడపగలిగేవాడిని కూడా కాదన్నారు. చాలా విషయాలు ఆలోచించుకునే చాలా నిర్ణయాలు తీసుకుంటామన్న ఏ పీ డిప్యూటీ సీఎం ప్రతీ విషయాన్ని రాద్దాంతం చేసే వాళ్లకు సమాధానం చెప్పుకుంటూ వెళ్లలేన్నారు పవన్ కళ్యాణ్.





















