అన్వేషించండి

Kakinada latest News: పోటీ ప్రపంచంలో బతకలేరని పిల్లల్ని క్రూరంగా చంపేసిన తండ్రి- కాకినాడలో ఘాతుకం 

Kakinada latest News: పిల్లలు పోటీ ప్రపంచంలో ఎలా బతుకుతారో అనే టెన్షన్ ప్రతి తండ్రికి ఉంటుంది. కానీ ఆ తండ్రికి మరింత ఎక్కువగా ఉంది. అంతే పిల్లల్ని హతమార్చి సూసైడ్ చేసుకున్నాడు.

Kakinada latest News: పిల్లలకు భవిష్యత్‌పై భరోసా కల్పించి వారిని ప్రయోజకులను చేయాల్సిన తండ్రే వారి ప్రాణాలు తీశాడు. దానికి ఆయన చెప్పిన కారణం చాలా విచిత్రంగా ఉంది. పోటీ ప్రపంచంలో బాగా రాణించలేరని ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సూసైడ్‌ లెటర్ కూడా రాశారు. హోలీ రజు జరిగిన దారుణం చూసి అంతా షాక్ అయ్యారు. 

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్‌ ఓఎన్‌జీసీ కార్యాలయంలో అసిస్టెంట్‌ ఎకౌంటెంట్‌. ఉండేది కాకినాడ జిల్లా వాకలపూడి. ఆయనకు ఇద్దరు పిల్లలు ఒకరు జోషిల్‌. ఏడేళ్లు ఒకటో తరగతి చదువుతున్నాడు. రెండోవాడు నిఖిల్‌. అతనికి ఆరేళ్లు. యూకేజీ చదువుతున్నాడు. 

హోలీ సందర్భంగా ఆఫీస్‌లో జరిగే వేడుకలకు ఫ్యామిలీతో హాజరయ్యాడు. కాసేపు అక్కడ ఉన్న చంద్రకిశోర్ సడెన్‌గా పని ఉందని చెప్పి పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేశాడు. ఎక్కడికి వెళ్తున్నారని భార్య అడిగితే పిల్లలకు యూనిఫామ్ కొలతలు తీయించాలని చెప్పాడు. అలా వెళ్లిన భర్త ఎంతసేపటికీ రాకపోవడంతో ఆయన తో పని చేసే వారి సాయంతో ఇంటికి వచ్చేసింది భార్య. 

ఇంటికి వచ్చి చూసిన చంద్రకిశోర్‌ భార్య ఇంటి తలుపులు లోపలికి వేసి ఉండటం చూసి షాక్ అయ్యింది. భర్త తనకు తెలియకుండా ఇంటికి ఎప్పుడు వచ్చారని కిటిలోంచి చూసింది. అక్కడ భర్త ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతున్నాడు కంగారు పడ్డ ఆమె తోటి వారి సాయంతో తలుపులు పగలగొట్టి లోపిలికి ఎంటర్ అయ్యింది. 

లోపలికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే పని జరిగింది. ఇద్దరి పిల్లల్ని కాళ్లు చేతులు కట్టేసి నీటి బకెట్లో వారిని ముంచి చంపేశాడు చంద్రకిశోర్‌. పక్కనే ఓ  సూసైడ్ నోట్‌ కూడా ఉంది. దాన్ని చదివిని వారంతా మరింతో షాక్‌కి గురయ్యారు. 

చంద్రకిశోర్‌ తన సూసైడ్‌ నోట్‌లో తన పిల్లల గురించి రాశాడు. తన పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో బతకలేరని వాటిని తట్టుకునే సామర్థ్యం వాళ్లకు లేదని అందుకే వారిని చంపేసిన తాను కూడా చచ్చిపోతున్నట్టు పేర్కొన్నాడు. 

సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డెడ్‌బాడీలను పోస్టుమార్టానికి పంపించారు. పవిత్రమైన హోలీ రోజు అపోహలతో ఇద్దరు పిల్లల్ని చంపడం తనూ సూసైడ్ చేసుకున్న దుర్ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

టాప్ హెడ్ లైన్స్

Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget