IPL 2025 News Updates: ఈసారి మరింత బలంగా టైటాన్స్.. ప్లే ఆఫ్స్ పై గురి.. బ్యాటింగ్, బౌలింగ్ మరింత పటిష్టం..
తొలి రెండు సీజన్లలో అటు బ్యాట్, ఇటు బంతితో కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా జట్టును ముందుకు నడిపించాడు. గత సీజన్ లో అతను వెళ్లిపోవడంతో శుభమాన్ గిల్ సారథ్య బాధ్యతలు మోశాడు.

Gujarat Titans Team Analysis: ఐపీఎల్లో 2022లో ప్రవేశించిన గుజరాత్ టైటాన్స్ జట్టు.. కొద్ది కాలంలోనే తన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆడిన తొలి సీజన్ లో నే విజేతగా నిలిచిన టైటాన్స్.. తర్వాత సీజన్లో రన్నరప్ గా నిలిచింది. ఇక గతేడాది మాత్రం ఎనిమిదో స్థానంలో నిరాశపర్చింది. తొలి రెండు సీజన్లలో అటు బ్యాట్, ఇటు బంతితో కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా జట్టును ముందుకు నడిపించాడు. గత సీజన్ లో అతను వెళ్లిపోవడంతో శుభమాన్ గిల్ సారథ్య బాధ్యతలు మోశాడు. ఇక గతేడాది మెగావేలంలో తాము ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో, అక్కడ ఫోకస్ పెట్టి, మెరికల్లాంటి ప్లేయర్లను కొనుగోలు చేయడం ప్లస్ పాయింట్. పేపర్ పై చూస్తే చాలా బలంగా కనిపిస్తున్న టైటాన్స్, మైదానంలో అలాంటి ప్రదర్శన చేయాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.
కీలక ప్లేయర్లను వదిలేసి..
గతేడాది మెగావేలం సందర్భంగా కొంతమంది కీలక ప్లేయర్లను వదిలేయక తప్పలేదు. డేవిడ్ మిల్లర్, మోహిత్ శర్మ, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్ లాంటి వాళ్లను రిలీజ్ చేసి, వేలంలో జోస్ బట్లర్, కగిసో రబాడ, గ్లెన్ ఫిలిప్స్ లతో పాటు కొంతమందిని కొనుగోలు చేసింది. జట్టు బ్యాటింగ్ విషయానికొస్తే కెప్టెన్ గిల్, బట్లర్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్, షారూఖ్ ఖాన్ లతో పటిష్టంగానే ఉంది. ఆల్ రౌండర్ గా రషీద్,వాషింగ్టన్ సుందర్ అటు బ్యాట్ తోనూ, ఇటు బంతితోనూ సత్తా చాటగలరు. ఇక బౌలింగ్ విషయానికొస్తే భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మలతోపాటు విదేశీ ప్లేయర్లు రబాడ, గెరాల్డ్ కొయెట్జీలతో బలంగా కనిపిస్తోంది. సరైన కూర్పుతో ముందుకు వెళితే నాకౌట్ లోకి ఈజీగా వెళ్లగలుగుతుంది.
ఫినిషర్ మిస్సయ్యాడా..?
వేలానిక ముందు మిల్లర్ ను రిలీజ్ చేసి టైటాన్స్ తప్పు చేసిందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మిడిలార్డర్లో తను వేగంగా పరుగులు సాధించి, ఒంటిచేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పగల సామర్థ్యం అతని సొంతం. అలాంటి ప్లేయర్ ప్రస్తుతం జట్టులో లేడు. అయినప్పటికీ టాపార్డర్ లో మాత్రం బట్లర్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లతో ప్రమాదకరంగా ఉంది. అతను స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ప్రత్యర్థులకు గడ్డు కాలమే. ఏదేమైనా మరోసారి ఈ సీజన్ లో టాప్-2లో ఉండాలని ఆ జట్టు టార్గెట్ పెట్టుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
గుజరాత్ టైటాన్స్ పూర్తి స్క్వాడ్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, షారుక్ ఖాన్, రాహుల్ తేవాటియా, నిషాంత్ సింధు, షెర్ఫేన్ రూథర్ ఫర్డ్, మహిపాల్ లోమ్రోర్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, అర్షద్ ఖాన్, జయంత్ యాదవ్, కరీం జనత్, వాషింగ్టన్ సుందర్, కుమార్ కుషాగ్ర, అనుజ్ రావత్, జోస్ బట్లర్, గెరాల్డ్ కోయెట్జీ, మనవ్ సుథార్, గుర్నూర్ బ్రార్, ఇషాంత్ శర్మ, కగిసో రబాడ, కుల్వంత్ ఖేజ్రోలియా, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

