(Source: ECI | ABP NEWS)
Telangana Latest News: తప్పుగా మాట్లాడలేదు, జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తేయండి- స్పీకర్‌కు బీఆర్‌ఎస్ రిక్వస్ట్
Telangana Latest News: ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిపై తీసుకున్న చర్యలపై పునరాలోచించాలని స్పీకర్‌కు బీఆర్‌ఎస్ సభ్యులు రిక్వస్ట్ చేశారు. తప్పుగా మాట్లాడలేదని సభలో వివరణ ఇచ్చారు.

Telangana Latest News: తెలంగాణ స్పీకర్‌ను అగౌరవపరిచేలా మాట్లాడలేదని బీఆర్‌ఎస్ మరోసారి స్పష్టం చేసింది. శనివారం సభ ప్రారంభ సమయంలో బీఆర్‌ఎస్ సభ్యుడు హరీష్ మాట్లాడుతూ జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌పై పునరాలోచించాలని రిక్వస్ట్ చేశారు.
సభలో హరీష్‌రావు మాట్లాడుతూ... స్పీకర్ అంటే తమకు చాలా గౌరవం ఉందని అన్నారు. ఆయన్న ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు సహకరించామని పేర్కొన్నారు. అలాంటి స్పీకర్‌ను అగౌరవపరిచే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. జగదీష్ రెడ్డి కూడా తప్పుగా మాట్లాడాలేదని వివరణ ఇచ్చారు. అందుకే సస్పెన్షన్‌ను పునఃపరిశీలించాలని కోరారు. సస్పెండ్ చేసే ముందు జగదీష్ రెడ్డి వివరణ కూడా తీసుకొని ఉంటే బాగుండేదని అన్నారు.
సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గారిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ ని కోరిన @BRSparty శాసనసభా పక్షం.
— Office of Harish Rao (@HarishRaoOffice) March 15, 2025
స్పీకర్ గారి పట్ల సీనియర్ శాసన సభ్యుడైన జగదీశ్ రెడ్డి గారు అమర్యాదగా ప్రవర్తించలేదు.
సస్పెన్షన్ పై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్‌ఎస్ పార్టీ తరపున వివరణ… pic.twitter.com/JldSpWxbT1
అంతకుముందు స్పీకర్ ఛాంబర్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభాపతిని కలిశారు. ఎలాంటి వివరణ తీసుకోకుండా చర్యలు తీసుకున్నారని అన్నారు. తప్పుగా మాట్లాడలేదని సస్పెన్షన్ ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.





















