Sankranti Special Buses : సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
Sankranti Special Buses :సంక్రాంతి ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అదనంగా ఆరు వందలకుపైగా బస్సులు వేసింది. టికెట్ రేట్లు పెంచొద్దని ప్రైవేటు ట్రావెల్స్ వాళ్లకి కూడా హెచ్చరించింది.
Sankranti Special Buses :సంక్రాంతికి ఊరి వెళ్లే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 6432 ప్రత్యేక బస్సులు సిద్ధం చేసింది. ప్రయాణికులకు అవసరమైన మరిన్ని బస్సులు నడపడానికి కూడా సిద్ధమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అదే టైంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలను హెచ్చరించారు.
సంక్రాంతి పండుగ కోసం నేటి నుంచి ప్రత్యేక బస్సు నడుపుతోంది. రద్దీ పెరిగినట్టు అయితే ఇంకా బస్సుల సంఖ్య పెంచుతామని ప్రకటించారు పొన్నం ప్రభాకర్. మరిన్ని బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రతి మేజర్ బస్ స్టేషన్ వద్ద ప్రత్యేక అధికారులు నియమించామని వివరించారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా వారు చూసుకుంటారన్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉన్నందున రద్దీ మరింత ఉంటుందని అధికారులకు పొన్నం ప్రభాకర్ సూచనలు చేశారు. అందుకు సరిపడా ఏర్పాట్లు చేయాలని హితవుపలికారు. ఎక్కడ ఇబ్బందులు కలిగించవద్దని అధికారులను ఆదేశించారు.
ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సంక్రాంతి పండగ పూట ప్రయాణికులను అదనపు చార్జీల పేరుతో దోపిడీకి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఛార్జీలనే వసూలు చేయాలని అదనంగా వసూలు చేస్తే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్ చేస్తామన్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అదనంగా వసూలు చేస్తే రవాణా శాఖ అధికారుల దృష్టికి ప్రయాణికులు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అధికారులు ఫీల్డ్‌లోనే ఉండాలని నిరంతరం తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా తక్షణం స్పందించాలని అన్నారు. అదనపు చార్జీలు వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే బస్సులు సీజ్ చేయడంతోపాటు కఠిన చర్యలు ఉంటాయన్నారు. తమ ప్రభుత్వం ప్రయాణికుల భద్రత, సంక్షేమనికే ప్రాధానత్య కల్పిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. ప్రయాణికులు పండగ సమయంలో జాగ్రత్తగా గమ్య స్థానాలకు వెళ్లాలని సూచించారు.