Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
Andhra News: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు.

Harsh Kumar Gupta As New DGP Of AP: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా (Harish Kumar Gupta) నియమితులయ్యే ఛాన్స్ ఉంది. 1992 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డీజీగా బాధ్యతలు నిర్వరిస్తుస్తున్నారు. ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో హరీష్ గుప్తాను తదుపరి పోలీస్ బాస్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది. తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత ఆయన్ను ఆ పోస్టులో కొనసాగించే అవకాశం ఉంది.
కాగా, సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్ కుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా ఎన్నికల సంఘం నియమించింది. దీంతొ కొన్ని రోజుల పాటు ఆయన ఆ పోస్టులో కొనసాగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలరావును డీజీపీగా నియమించింది. ఆయన పదవీ విరమణ చేశాక సీనియారిటీ జాబితాలో 1991వ బ్యాచ్‌కు చెందిన అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉంటారు. హరీష్ గుప్తా రెండో స్థానంలో ఉన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

