Mahesh Babu : సుకుమార్ కూతురు నటించిన 'గాంధీ తాత చెట్టు'పై మహేష్ బాబు రివ్యూ - ఏమన్నారంటే!
Gandhi Tatha Chettu First Review: డైరెక్టర్ సుకుమార్ కూతురు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. రేపు థియేటర్లో విడుదల కాబోతోన్న ఈ సినిమాపై మహేష్ బాబు రివ్యూ ఇస్తూ పోస్ట్ షేర్ చేశారు.

Mahesh Babu Tweet on Gandhi Tatha Chettu : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో పద్మావతి మల్లాది దర్శకత్వంలో గాంధీ తాత చెట్టు తెరకెక్కింది. జనవరి 24న ఈ సినిమా థియేటర్‌లో విడుదల కాబోతోంది. గాంధీ ఆశయాలు, సిద్ధాంతల నేపథ్యంలో మెసేజ్ ఒరియెంటెడ్‌గా ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకుంది. దీంతో గాంధీ తాత చెట్టుపై అంచనాలు నెలకొన్నాయి. పైగా సుకుమార్ కూతురు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కూతురి కోసం సుకుమార్ కూడా సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన సుకృతి ఇంటర్య్వూ వీడియోలే దర్శనం ఇస్తున్నాయి. దీంతో ఈ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
మహేష్ బాబు రివ్యూ
ఇక గాంధీ చెట్టు సినిమాపై తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన రివ్యూ ఇచ్చారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. రేపు మూవీ రిలీజ్ సందర్భంగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ, మూవీ టీం ఆల్ ది బెస్ట్ చెబుబూ మహేష్ ఎక్స్‌లో పోస్ట్ షేర్ చేశాడు. "గాంధీ తాత చెట్టు.. ఈ సినిమా మీ జీవితాల్లో భాగం అవుతుంది. అహింస అనే పాయింట్ తీసుకుని దానిని అందంగా మలిచి మీ జీవితాల్లోకి తీసుకువస్తున్నారు డైరెక్టర్ పద్మమల్లాడి. మై లిటిల్ ఫ్రెండ్ సుకృతివేణి.. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను. ఈ సినిమాతో నువ్వు అందమైన నటిగా ఎదిగిన తీరు, నీ అద్భుతమైన నటన, పర్ఫామెన్స్ చూస్తుంటే నాకు నీపై గౌరవం కలుగుతోంది. గాంధీ చెట్టు చిన్న మాస్టర్ పీస్ సినిమా. మీరంత కూడా ఈ సినిమా చూసి ఆనందించండి" అంటూ మహేష్ ఈ సినిమాపై తన రివ్యూ ఇచ్చాడు. అంతేకాదు తన ట్వీట్‌కి సుకుమార్‌ను ఆయన భార్య తబితను కూడా ట్యాగ్ చేశారు. ప్రస్తుతం మహేష్ ట్వీట్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది. కాగా ఈసినిమా ట్రైలర్‌ని మహేష్ బాబు ఆన్‌లైన్ వేదికగా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
#GandhiThathaChettu… This film will stay with you. ❤️ A poignant story about ahimsa beautifully brought to life by @padmamalladi14.
— Mahesh Babu (@urstrulyMahesh) January 23, 2025
So incredibly proud of you my little friend #SukritiVeniBandireddi.. watching you grow into this beautiful actress and deliver such a powerful…
అగ్ర నిర్మాణ సంస్థలో
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలపై నవీన్ ఎర్నేని, రవిశంకర్, శేష సింధు రావులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సుకుమార్ భార్య తబితా సుకుమార్ ఈ చిత్రానికి సమర్పకురాలుగా వ్యవహరించిన ఈ సినిమా ఇప్పటికే దేశ విదేశాల్లో ఎన్నో అవార్డులు అందుకోవడం విశేషం. ఇక ఇందులో గాంధీ అనే పాత్రలో సుకృతి కనిపించబోతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఎమోషనల్‌గా ఆకట్టుకుంది. గాంధీ గారి సిద్ధాంతాలను గౌరవిస్తూ ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి.. తన తాతకు ఇచ్చిన మాట కోసం ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసిందనేది గాంధీ తాత చెట్టు కథ. రిలీజ్‌కు ముందే అవార్డు గెలుచుకున్న ఈ సినిమా రేపు థియేటర్‌లో రిలీజ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
Also Read : ఫస్టాఫ్ పైసా వసూల్... సెకండాఫ్ అంతకు మించి, బాక్సులు బద్దలే - 'అఖండ 2'పై తమన్ ఫస్ట్ రివ్యూ





















