Akhanda 2 Thaandavam First Review: ఫస్టాఫ్ పైసా వసూల్... సెకండాఫ్ అంతకు మించి, బాక్సులు బద్దలే - 'అఖండ 2'పై తమన్ ఫస్ట్ రివ్యూ
Thaman Review on Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్ని ఈచిత్రంపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన కామెంట్స్ మరింత బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

Thaman First Review on Balakrishna Akhanda 2: నందమూరి బాలకృష్ణ ఇటీవల నటించిన డాకు మహారాజ్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం మూవీ టీం ఇంత డాకు మహారాజ్ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ మూవీ సక్సెస్ మీట్‌ని నిర్వహిస్తుంది. ఈ క్రమంలో బుధవారం అనంతపురంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ మూవీకి సంబంధించిన విశేషాలను పంచుకున్నాడు. అలాగే బాలయ్య-బోయపాటి కాంబో తెరకెక్కుతోన్న అఖండ 2కి సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. అతడి మాటలతో మూవీపై అంచనలు మరింత రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలన్ని మంచి విజయం సాధించాయి. యాక్షన్, ఫ్యాక్షన్‌కి కేరాఫ్ అయిన బోయపాటి శ్రీను నందమూరి ఫ్యాన్స్ నాడీపై మంచి పట్టు ఉంటుంది. బాలయ్య నుంచి అభిమానులు ఏం ఆశిస్తారో సరిగ్గా అదే తెరపై చూపించి మ్యాజిక్ చేస్తారు బోయపాటి. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొంటాయి. అయితే బాలయ్యతో అఖండ 2 చేస్తున్నారు. 2021లో విడుదలైన అఖండ చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తుంది. బోయపాటి డైరెక్షన్, బాలయ్య పర్ఫామెన్స్, తమన్ మ్యూజిక్ కాంబినేషన్ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకువెళ్లింది. థియేటర్‌లో ఈ సినిమాకి సౌండ్సే బద్దలు అయ్యాయి. అఘోరగా బాలయ్య నటనతో విజృంభించగా.. తన బీజీయం, మ్యూజిక్‌తో తమన్ దుమ్మురేపాడు. ఈ కాంబో ఎంత వైల్డ్‌గా ఉంటుందో అఖండతో చూపించారు.
ఫస్టాఫ్ పైసా వసూల్
ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా బీజీయంకి థియేటర్‌ల బాక్సాసులు కూడా తట్టుకోలేక ఆగిపోయిన సందర్భాలు చూశాం. ఇప్పుడు దీనికి సీక్వెల్ అనగానే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాంటి ఈ సినిమాపై తమన్ చేసిన కామెంట్స్ మూవీపై మరింత హైప్ పెంచుతున్నాయి. అఖండ 2 నెక్ట్స్ లెవెల్లో ఉండబోతుందని బజ్ పెంచాడు. ఈ సినిమా కోసం బోయపాటి చాలా కష్టపడుతున్నారని, ఫస్టాఫ్ పైసా వసూల్ అని అన్నాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ అదిరిపోతుందన్నాడు. ఆ సీన్‌కి ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పించడం పక్కా. ఇక సెకండాప్ అయితే అంతకు మించి ఉండబోతుందంటూ మూవీపై మరింత బజ్ పెంచాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్ నందమూరి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అఖండ 2 రిలీజ్ అయిన థియేటర్లో మాస్ జాతరే అంటూ అంచనాల్లో మునిగితేలుతున్నారు. ఇదిలా ఉంటే అఖండ 2 మూవీ షూటింగ్ మొదలైందే ఇటీవల..ఇంకా మూవీ 30 శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేదు. కానీ, తమన్ మాత్రం అప్పుడే ఫస్టాఫ్, సెకండాఫ్ అంటూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నాడంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
కుంభమేళలో కీలక సన్నివేశాలు
ఏదేమైన బాలయ్య, బోయపాటి నుంచి వస్తున్న సినిమా కాబట్టి సినిమా థియేటర్లో దద్దరిల్లడం ఖాయమే అని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇటీవల మూవీ డాకు మహారాజ్ ప్రమోషన్ ఈవెంట్స్‌లో సౌండ్‌కి బాక్సులు పడిపోయాయి. దీనిపై తమన్ మాట్లాడుతూ అఖండ 2కి కూడా ఇలానే ఉంటుందని మీరంత ఫిక్స్ అయిపోండని అన్నాడు. బాలయ్య, తమన్ కాంబో అంటే థియేటర్లు దద్దరిల్లుతాయి, బాక్సులు పగిలిపోతాయని వ్యాఖ్యానించాడు. మా సినిమా అంటేనే ఇలా ఉంటుందని ముందే ప్రిపేర్ అయ్యి థియేటర్‌కు వెళ్లాలన్నాడు. అలా అఖండ సినిఇమా థియేటర్‌లో బాక్సులు బద్దలయ్యాయి. మరి అఖండ 2కి ఆయన మ్యూజిక్, బీజీయం ఏ రేంజ్‌లో ఉండబోతుందో చూడాలి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇటీవల కుంభమేళలో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరణ జరుపుకుంది. ఇక్కడ ఇంట్రాడక్షన్ సీన్స్‌తో పాటు పలు ముఖ్య సన్నివేశాలను తెరకెక్కించినట్టు సమాచారం. నెక్ట్స్ షెడ్యూల్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ గుడిమెట్ల గ్రామం కృష్ణానది తీరాన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోస బోయపాటి స్వయంగా వెళ్లి అక్కడి లోకషన్స్ పరిశీలించినట్టు సమాచారం.
Also Read: పాపం రష్మిక... కుంటి కాలుతో ఎయిర్ పోర్టులో ఎన్ని కష్టాలు పడిందో ఈ ఫోటోల్లో చూడండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

