CM Chandrababu Naidu Davos Interview | మనం పెట్టుబడులు అడగటం కాదు..మనోళ్లే ఎదురు పెడుతున్నారు | ABP Desam
'భారత్' బ్రాండ్ ను మళ్లీ నిలబెడుతున్నాం. ప్రధాని మోదీ నాయకత్వంలో
మన దేశం చాలా శక్తివంతమైన దేశంగా తయారైంది. ప్రపంచదేశాల పెట్టుబడిదారులంతా మన దేశాన్ని గుర్తిస్తున్నారు. మనల్ని గొప్పగా చూస్తున్నారు. దావోస్ సదస్సు ద్వారా మనం మన దేశంలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నామో..ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చాటి చెబుతున్నాం. మనమందరం కలిసి పనిచేస్తేనే డబుల్ డిజిట్ గ్రోత్ ఉంటుంది. మన దేశానికి అది చాలా అవసరం. అన్ని చోట్ల మనం శక్తివంతంగా ఉన్నాం..కొంచెం కష్టపడి పనిచేయాలంతే.
అన్ని రాష్ట్రాలకు పెట్టుబడులు వస్తున్నాయి. వాళ్ల వాళ్ల శక్తిసామర్థ్యాల ఆధారంగా మార్కెట్ తయారు అవుతోంది. ఇవాళ చూస్తే అన్ని రాష్ట్రాల మధ్య పోటీతత్వం ఉంది. ఆ పోటీతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఫలితంగా పెట్టుబడులు మన దేశానికి వస్తున్నాయి. అలాగే మన వ్యాపారులు ప్రపంచదేశాలకు తమ సేవలను విస్తరిస్తున్నారు. గతంలో మనం పెట్టుబడులు అడిగివాళ్లం. ఇప్పుడు మన వాళ్లు కూడా అన్ని దేశాల్లో పెట్టుబడులు పెట్టే స్థాయికి చేరుకున్నారు. ప్రపంచదేశాల్లో ఉన్న భారతీయులు అంతా గొప్ప వ్యాపారవేత్తలుగా మారుతున్నారు.



















